రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన ఛార్మీ (Charmme Kaur).. సోష‌ల్ మీడియాలో రిప్ అంటూ పోస్టులు !

Updated on Sep 08, 2022 09:02 PM IST
సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ఛార్మీకౌర్ (Charmme Kaur) స్పందించారు. అవ‌న్నీ పుకార్లేన‌ని ట్వీట్ చేశారు.
సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ఛార్మీకౌర్ (Charmme Kaur) స్పందించారు. అవ‌న్నీ పుకార్లేన‌ని ట్వీట్ చేశారు.

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'లైగ‌ర్' (Liger) చిత్రం భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రొడ్యూస‌ర్ల‌లో ఛార్మీకౌర్ ఒక‌రు. ఈ సినిమా ఫ్లాప్‌తో ఎన్నో రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ఛార్మీకౌర్ (Charmme Kaur) స్పందించారు. అవ‌న్నీ పుకార్లేన‌ని ట్వీట్ చేశారు. సోష‌ల్ మీడియాకు కొన్ని రోజులు దూరంగా ఉంటాన‌ని కొద్ది రోజుల క్రితం ఛార్మీ ప్ర‌క‌టించారు. అయితే, తాజాగా వ‌స్తున్న పుకార్ల‌పై స్పందించేందుకు ఛార్మీ మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. 

ఫేక్ వార్త‌ల‌పై ఛార్మీ క్లారిటీ

'లైగ‌ర్' సినిమా భారీ న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేకపోయింది. బాలీవుడ్ ద‌ర్శ‌క, నిర్మాత క‌ర‌ణ్ జోహార్, ఛార్మీ కౌర్ 'లైగ‌ర్' చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హరించారు. 'లైగ‌ర్' హిట్ కాక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ ఫేక్ వార్త‌ల‌పై ఛార్మీకౌర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న సోష‌ల్ మీడియాలో ఫేక్ వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్దని తెలిపారు. 

ఫేక్ న్యూస్‌కు చెక్
'జనగణమన' నిర్మాతలలో ఒకరైన  మై హోమ్ గ్రూప్ ఈ ప్రాజెక్టు నుండి  తప్పుకున్నారని తొలుత వార్తలొచ్చాయి. అందుకే ఇప్ప‌ట్లో ఆ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం లేద‌నే వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. మ‌రోవైపు పూరీ జ‌గ‌న్నాథ్ అద్దె కట్టలేక ముంబై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేస్తున్నార‌నే ప్ర‌చారం కూడా జరిగింది.

పూరీ ముంబయిలో నెలకు రూ.10 లక్షలు రెంట్ చెల్లిస్తున్నారని కూడా గతంలో వార్తలొచ్చాయి. ఇక ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన ఛార్మి ఆర్థికంగా న‌ష్ట‌పోయారనే గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌కు ఛార్మీకౌర్ ఒక్క ట్వీట్‌తో చెక్ పెట్టారు. త‌మపై వ‌స్తున్న వార్త‌లు నిజం కాద‌న్నారు. ఇలాంటి ఫేక్ వార్త‌ల‌కు రిప్ అంటూ ట్వీట్ చేశారు. 

Read More: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – దిల్‌ రాజు కాంబో సినిమాకు హరీష్‌ శంకర్‌‌ కథ రెడీ చేస్తున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!