మంచు ల‌క్ష్మితో (Manchu Laxmi) క‌లిసి వెండితెర‌పై ఎంట్రీకి సిద్ద‌మైన సురేఖావాణి కూతురు!

Updated on May 07, 2022 07:53 PM IST
న‌టి సుప్రిత‌ (Actress Supritha With her Mother)
న‌టి సుప్రిత‌ (Actress Supritha With her Mother)

టాలీవుడ్ (Tollywood) లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సురేఖవాణి. అయితే, ఆమె కూతురు సుప్రీతను కూడా వెండితెరకు పరిచయం చేస్తోంది. ప్రస్తుతం సుప్రీతం పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మంచు లక్ష్మి ప్రధానపాత్ర పోషిస్తున్న 'లేచింది మహిళా లోకంస సినిమాలో సుప్రీత కూడా నటిస్తోంది. 

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు తాజాగా ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించిన వివరాలను మంచు (Manchu Lakshmi)లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. ‘విప్లవం మొదలైంది‘ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా షూటింగ్ ప్రారంభమైందని చిత్ర బృందం పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు కార్తీక్-అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.  మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా పోస్ట‌ర్ ను షేర్ చేసి షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నానంటూ రాసుకొచ్చారు.

కాగా, సుప్రీతకు (Supritha) కెమెరా కొత్తకాదు. ఆమె ఇప్పటిదాకా అనేక షార్ట్ ఫిలింస్ లో నటించింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. అంతేకాదు, తల్లి సురేఖ వాణితో కలిసి సుప్రీత చేసే డ్యాన్స్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా అలరిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే సుప్రీత ఇప్పటికే హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇందులో భాగంగానే సామాజిక మాధ్య‌మాల‌ వేదికగా అభిమానులతో ముచ్చటించే సుప్రిత‌కు తరచూ ఓ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఎప్పుడు ఇవ్వనున్నారు అంటూ పలుమార్లు నెటిజన్లు ఆమెను ప్రశ్నించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!