'ఊ అంటావా మావా' పాటకు సల్మాన్ ఖాన్ (Salman Khan) కామెంట్స్.. సమంత (Samantha) రియాక్షన్ ఇదే!

Updated on Jun 28, 2022 06:49 PM IST
ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే కేవ‌లం బాలీవుడ్ అని బ‌య‌ట జనాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి.
ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే కేవ‌లం బాలీవుడ్ అని బ‌య‌ట జనాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి.

సౌత్‌ ఇండస్ట్రీతో పాటు నార్త్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నటి సమంత (Samantha). ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ది ఫ్యామిలీ మేన్ 2'తో బాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకుంది సామ్.

అంతేకాకుండా 'పుష్ప' చిత్రంలో చేసిన 'ఊ అంటావా మావా' స్పెషల్‌ సాంగ్‌తో అనేక మంది చేత 'ఊ' కొట్టేలా చేసింది. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. 

స‌మంత త‌న కెరీర్‌లో చేసిన తొలి ఐటెమ్ సాంగ్ అదే. ఇప్పుడ‌దే సాంగ్ బాలీవుడ్ భాయ్‌జాన్ స‌ల్మాన్‌ఖాన్‌ (Salman Khan)కు కూడా బాగా న‌చ్చేసింది. ఇదెవ‌రో చెప్పిన విష‌యం కాదు.. స్వయంగా ఆయ‌నే చెప్పారు. రీసెంట్‌గా ఓ కార్య‌క్ర‌మానికి ఆయ‌న అతిథిగా విచ్చేసిన‌ప్పుడు యాంక‌ర్ ఆయ‌న్ని కొన్ని ప్ర‌శ్న‌లు వేయగా, సల్లూ భాయ్ చాలా ఆసక్తికరమైన సంగతులను పంచుకున్నారు.

అందులో భాగంగా రీసెంట్ టైమ్‌లో మీకు బాగా న‌చ్చిన సాంగ్ ఏదో చెప్పండి.. అని ప్ర‌శ్నించగా.. ఆయ‌న 'ఊ అంటావా మావ‌'.. అంటూ హ‌మ్ చేస్తూ వెళ్లిపోయారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

 

ఈ క్రమంలో ఈ వీడియో చూసిన సమంత తెగ సంబర పడిపోయింది. సల్లూ భాయ్ వీడియోను రీట్వీట్‌ చేస్తూ ఎరుపు రంగులో ఉన్న హార్ట్‌ ఎమోజీస్‌‌ను పోస్ట్ చేసి.. తన సంతోషాన్ని చాటుకుంది. ప్రస్తుతం సామ్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

అయితే, ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే కేవ‌లం బాలీవుడ్ అని బ‌య‌ట జనాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. ఎప్పుడైతే ఓటీటీ ట్రెండ్ మొద‌లైందో.. అప్పుడు ప్ర‌పంచ సినిమాల‌ను ప్రేక్ష‌కులు వీక్షించ‌టం ప్రారంభించారు. దీంతో సౌత్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో స‌త్తా చాటుతున్నాయి. అలాగే రీసెంట్ టైమ్‌లో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాలు రెండు ఉన్నాయి. ఒక‌టి 'పుష్ప ది రైజ్' (Pushpa The Rise) కాగా.. రెండో సినిమా కేజీఎఫ్ 2 (KGF 2). 

Read More: నాగ చైతన్యతో 'శోభిత ధూళిపాళ‌' డేటింగ్‌ ! అయితే స‌మంత (Samantha) కు ఎందుకంత కోపం ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!