Actress Samantha: ప్రీతమ్ జుకల్కర్ తో సమంత డేట్ నైట్.. మరోసారి అక్కినేని అభిమానులు ఫైర్!

Updated on Jun 03, 2022 12:27 PM IST
సమంత, ప్రీతమ్ జుకల్కర్, సాధనా సింగ్ (Samantha, Sadhna Singh, Preetham Jukalkar)
సమంత, ప్రీతమ్ జుకల్కర్, సాధనా సింగ్ (Samantha, Sadhna Singh, Preetham Jukalkar)

Actress Samantha: సినిమాల పరంగా స్టార్ హీరోయిన్ సమంత జోరు పెంచింది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉంది. అక్కినేని నాగచైతన్యతో విడాకులు అయిన తర్వాత సమంత తన పూర్తి దృష్టిని సినిమాల పైనే ఉంచింది. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా నటించేందుకు సమంత రెడీ అవుతోంది. అందుతున్న సమాచారం మేరకు సమంత ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత ముంబయిలో ఇల్లు కొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తుండడంతో సమంత తన మకాం ముంబయికి మార్చిందట. 

మరోవైపు సమంత నటించిన 'శాకుంతలం' (Shakuntalam) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో సామ్ టైటిల్ రోల్ పోషిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం నటిస్తున్న యశోద సినిమా కూడా చివరిదశ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగష్టు 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ ప్రేక్షకులని అలరించబోతోంది. ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్ తో సైతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. 

సమంత, ప్రీతమ్ జుకల్కర్, సాధనా సింగ్ (Samantha, Sadhna Singh, Preetham Jukalkar)

ఇలా.. వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. జిమ్ వర్కౌట్స్, తన ఇంట్లో ఉన్న పెట్స్ అల్లరిని అభిమానులతో పంచుకుంటోంది. ఇదిలా ఉండగా సమంత తాజాగా ఊహించని షాక్ ఇచ్చింది. తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో కలసి సామ్ డేట్ నైట్ కి వెళ్ళింది. వీరిద్దరితో పాటు సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ కూడా ఉన్నారు. ఈ ఫోటోలని స్వయంగా సమంత డేట్ నైట్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్యాన్స్ కి ఇది ఊహించని షాక్ గా మారింది. ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అక్కినేని అభిమానులు మరోసారి ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమంత, ప్రీతమ్ జుకల్కర్, సాధనా సింగ్ (Samantha, Sadhna Singh, Preetham Jukalkar)

సమంత.. అక్కినేని హీరో నాగచైతన్యను (Hero Naga Chaitanya) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగు సంవత్సరాలపాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట పలు కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే, సమంత విడాకులకు కారణం తన డిజైనర్ ప్రీతమ్ అని ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. సమంత, ప్రీతమ్ లు బెస్ట్ ఫ్రెండ్స్. అయినప్పటికీ చైతుతో బ్రేకప్ సమయంలో ప్రీతమ్ గురించి అనేక రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్ ని సామ్, ప్రీతమ్ ఇద్దరూ తీవ్రంగా ఖండించారు. అయితే, సమంత ఈ ఫొటోల్లో హాట్ గా క్యూట్ గా కనిపిస్తోంది. ఫ్రంట్ జిప్ రెడ్ మినీ డ్రెస్ ఓ సమంత హాట్ గా కనిపిస్తోంది. వీరు ముగ్గురూ కలిసి క్యూట్ గా హంగామా చేస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు.

Read More: Kushi: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల‌పై వ‌చ్చిన వార్త‌లు నిజం కాదంటున్న‌ ద‌ర్శ‌కుడు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!