Liger Trailer Launch Event: 'లైగర్' సినిమాతో ఇండియా మొత్తం షేక్ అవ్వాలి.. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రౌడీ బాయ్!

Published on Jul 23, 2022 06:34 PM IST

Liger Trailer Launch Event: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా 'లైగర్' తెలుగు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ లో జరిగింది. ఈ సందర్భంగా సినిమా హాల్ అంతా అభిమానుల ఈలలు, చప్పట్లు, కేకలతో దద్దరిల్లింది. ఏకంగా 75 ఫీట్ల కటౌట్ ను ఆయన ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్బంగా.. విజయ్ దేవరకొండ అభిమానులకు కిక్ ఇచ్చే రేంజ్ లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆగస్ట్ 25న (Liger Release Date) 'లైగర్' విడుదలయ్యే ప్రతి థియేటర్ అభిమానులతో నిండిపోవాలని విజయ్ దేవరకొండ అన్నాడు. లైగర్ సినిమాతో ఇండియా మొత్తం షేక్ అవ్వాలని పేర్కొన్నాడు. అభిమానుల మధ్య వేడుకగా ట్రైలర్ ను లాంఛ్ చేశారు. 

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మాట్లాడుతూ అభిమానుల ప్రేమ చూస్తుంటే ఈ రోజు ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. ''ట్రైలర్ కి ఈ రచ్చ ఏందిరా నాయనా! ఏందిరా ఈ మెంటల్ మాస్'' అంటూ తన ముందు ఉన్న అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశారు. 

ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో (Liger Trailer Launch Event) ఇంకా ఆయన మాట్లాడుతూ.. తనకు డ్యాన్స్ అంటే నాకు చిరాకు అని విజయ్ దేవరకొండ చెప్పారు. అయినా సరే 'లైగర్'లో పాటలకు అంత డ్యాన్స్ చేశానంటే మా వాళ్ళు (అభిమానులు) గర్వంగా ఫీల్ కావాలని, ఎంజాయ్ చేయాలని ఆయన అన్నారు. 

పూరి జగన్నాథ్ (Director Puri Jagannath) మాట్లాడుతూ 'లైగర్' సినిమాలో విజయ్ తన నటనతో చించేశాడని పేర్కొన్నాడు. లైగర్ గురించి కాకుండా విజయ్ గురించి మాట్లాడటానికే తాను ఇక్కడకు వచ్చానని అన్నాడు ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ స్టార్ గా విజయ్ నిలుస్తాడని, తన మాటలను రాసిపెట్టుకోమని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కరణ్ జోహార్, అనిల్ తడానీ, హీరోయిన్ అనన్యా పాండే, ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ తదితరులు పాల్గొన్నారు. 

Read More: Liger (లైగర్) సినిమా ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాపై భారీ అంచనాలు !