Taapsee Pannu: 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) చాట్ షో పై బాలీవుడ్ బ్యూటీ తాప్సీ బోల్డ్ సమాధానం.. వైరల్!

Updated on Aug 09, 2022 06:40 PM IST
 ‘కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు’ అని తాప్సీ బోల్డ్‌ గా సమాధానం (Taapsee Bold Answer)చెప్పింది.
‘కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు’ అని తాప్సీ బోల్డ్‌ గా సమాధానం (Taapsee Bold Answer)చెప్పింది.

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కాఫీ విత్‌ కరణ్‌ (Koffee With Karan) ఛాట్‌షో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ షోను రెగ్యురల్ గా ఫాలో అయ్యే కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక, ఈ షోకు వచ్చే సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు చూస్తూ వారి గురించి తెలుసుకుంటూ ఈ షోను మరింత ఆదరిస్తున్నారు. ఈ షో ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం 7వ సీజన్ ప్రసారం అవుతోంది.  

జులై 1 నుంచి ప్రారంభ‌మైన 'కాఫీ విత్‌ కరణ్‌ సీజ‌న్ 7' లో సినీ ప‌రిశ్ర‌మ నుంచి అన‌న్యా పాండే, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), జాన్వీ క‌పూర్‌, సారా అలిఖాన్‌, క‌రీనా క‌పూర్‌, అమీర్ ఖాన్ వంటి దిగ్గ‌జాలు క‌ర‌ణ్‌తో ముచ్చ‌టిస్తూ సంచ‌ల‌న విష‌యాలు పంచుకున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ 7 న్యూ ఎపిసోడ్స్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్ర‌తి గురువారం ప్ర‌సార‌మ‌వుతాయి. కాగా, ఈ సారి మాత్రం కొద్దిగా మసాలా యాడ్ చేసి ఎపిసోడ్స్ ను విడుదల చేస్తున్నారు.దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఈ షోపై కొద్దిగా వ్యతిరేకత ఎదురవుతోంది.  

ఇటీవల లైగర్‌ ప్రమోషన్లలో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ , అన‌న్య పాండే (Ananya Pandey).. లాల్‌ సింగ్ చద్దా ప్రమోషన్లలో ఆమిర్ ఖాన్‌ , కరీనా క‌పూర్ వంటి సెలబ్రటీలు ఈ షోకు హాజరయ్యారు. శృంగారానికి సంబంధించి కరణ్‌ అడిగిన ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతకుముందు సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ కూడా ఇలాగే ఓపెన్‌ అయ్యారు. 

ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను (Taapsee Pannu) ను ఈ షో గురించి మీడియా ప్రశ్నించింది. ఇక, ఈమెను కదిలిస్తే ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా కాంట్రవర్సీ లను ఫేస్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు తాజాగా కరణ్ కాఫీ షో గురించి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. 

ప్రస్తుతం తాప్సీ నటించిన 'దోబారా' (Dobaaraa) సినిమా ఆగస్టు 19న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తన సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొంటున్న తాప్సీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగా కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 7లో మీరు ఎందుకు పాల్గొనడం లేదు ? అని అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. 

తాను కరణ్ షోకి వెళ్లకపోవడానికి కారణం చెబుతూ… ‘కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు’ అని తాప్సీ బోల్డ్‌ గా సమాధానం (Taapsee Bold Answer)చెప్పింది. ఏది ఏమైనా ఈ సొట్ట బుగ్గల సుందరి చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 

Read More: 'తాప్సీ' బర్త్ డే స్పెషల్.. ఈ సోగ కళ్ల సుందరి సినీ ప్రయాణం ఎలా సాగిందో మనమూ తెలుసుకుందామా !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!