'దిల్ వాలే దుల్హానియా లే జాయింగే' (Dilwale Dulhania Le Jayenge) రీమేక్ ప్లానింగ్.. హీరోహీరోయిన్లు ఎవరంటే?

Updated on Nov 06, 2022 03:03 PM IST
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన 'దిల్ వాలే దుల్హానియా లే జాయింగే' (Dilwale Dulhania Le Jayenge) ఒకటి.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన 'దిల్ వాలే దుల్హానియా లే జాయింగే' (Dilwale Dulhania Le Jayenge) ఒకటి.

టాలీవుడ్ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం కమర్షియల్‌ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ హీరో తాజాగా నటించిన పాన్ ఇండియా సినిమా 'లైగర్'(Liger). ఇటీవల విడుద‌లైన ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎవరూ ఊహించిన విధంగా డిజాస్టర్ పాలయ్యింది. దీంతో దీని ప్రభావం విజయ్ కెరియర్ మీద పడుతుందని అందరూ అనుకున్నారు. 

కానీ దీనికి విరుద్ధంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ కోసం ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే విజయ్‌ తదుపరి సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

'దిల్ వాలే దుల్హానియా లే జాయింగే' రీమేక్ లో (Dilwale Dulhania Le Jayenge Remake) ముందుగా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) నటిస్తారని ప్రచారం జరిగింది.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన 'దిల్ వాలే దుల్హానియా లే జాయింగే' (Dilwale Dulhania Le Jayenge) ఒకటి. ఇందులో షారుఖ్ సరసన కాజోల్ నటించింది. ఈ సినిమాతో ఎవర్ గ్రీన్ ఆన్ స్క్రీన్ జోడీగా నిలిచిపోయారు కాజోల్,షారుఖ్. అదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకావ్యం అప్పట్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టి.. భారీగా వసూళ్లు రాబట్టడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకుల అనుభూతికి తగినట్టుగా స్టోరీ డిజైన్ చేసి రీమేక్ చేయాలని భావిస్తున్నారట.

'దిల్ వాలే దుల్హానియా లే జాయింగే' రీమేక్ లో (Dilwale Dulhania Le Jayenge Remake) ముందుగా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది ఇప్పటివరకు పట్టాలేక్కలేదు. ఈ నేపథ్యంలో ఆదిత్య చోప్రా ఈ సినిమాలో విజయ్ దేవరకొండను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: Vijay Deverakonda : విజయ్, రష్మికలు ప్రేమలో ఉన్నారని రూమర్స్.. మాల్దీవుల ట్రిప్‌లో "గీత గోవిందం" జంట !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!