రామ్ ‘ది వారియర్’తో తాప్సీ (Taapsee Pannu) ‘శభాష్ మిథు’ పోటీ

Updated on Apr 29, 2022 07:04 PM IST
తాప్సీ (Taapsee Pannu), మిథాలీరాజ్
తాప్సీ (Taapsee Pannu), మిథాలీరాజ్

ప్రస్తుతం కమర్షియల్ కథలతోపాటు నిజజీవిత కథలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే కొంతకాలంగా వరుసపెట్టి ప్రముఖుల జీవితకథల ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. తాము ఎంతగానో ఆరాధించే, అభిమానించే వ్యక్తుల నిజజీవిత విశేషాలను తెరమీద చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. దాంతో దర్శకనిర్మాతలు కూడా అలాంటి కథలపైనే దృష్టి సారిస్తున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో ప్రముఖ‌ క్రికెట‌ర్ల‌ నిజ‌జీవిత క‌థ‌లు సినిమాలుగా తెర‌కెక్కి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడమే కాకుండా విమ‌ర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకుంటున్నాయి. వాటిలో ముఖ్యంగా’M.S ధోని:ది అన్‌టోల్డ్ స్టోరి’,’ 83′ చిత్రాలు ముందు వరుస‌లో ఉంటాయి. ఈ క్రమంలోనే తాప్సీ ‘శ‌భాష్ మిథూ’ అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాలో ప్రధాన పాత్రలో న‌టించింది. భార‌త మహిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌ ‘మిథాలీ రాజ్’ జీవిత క‌థ ఆధారంగా ‘శ‌భాష్ మిథు’ చిత్రం తెర‌కెక్కింది. శ్రీజిత్ ద‌ర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో తాప్సీ (Taapsee Pannu) మిథాలీరాజ్ పాత్రలో న‌టించింది. యాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన శభాష్ మిథులో అనుభవజ్ఞుడైన నటుడు విజయ్ రాజ్ కూడా ఉన్నారు.

 ఇదివ‌ర‌కే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప్రచార చిత్రాలు, టీజ‌ర్ మంచి ఆదరణ దక్కించుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల‌లో అంచ‌నాలు పెంచాయి. ఈ క్రమంలో చిత్రబృందం విడుద‌ల తేదీని ప్రక‌టించింది. ఈ చిత్రాన్నిజూలై 15న పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల చేయ‌బోతున్నట్లు నిర్మాతలు ప్రక‌టించారు.

 అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ఒక రోజు ముందే రామ్ పోతినేని హీరోగా న‌టిస్తున్న ‘ది వారియ‌ర్’ చిత్రం విడుద‌ల కానుంది. ఎన్.లింగుస్వామి ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల‌లో భారీ అంచానాలు ఉన్నాయి. మ‌రి రామ్‌తో పోటీని త‌ట్టుకుని తాప్సీ నిలుస్తుందా లేదా చూడాలి.

ఈ సందర్బంగా భారత క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తన రాబోయే చిత్రం ‘శభాష్ మిథు’ జూలై 15న థియేటర్లలోకి రానుందని బాలీవుడ్ స్టార్ తాప్సీ పన్ను శుక్రవారం ప్రకటించింది. జిత్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రియా అవెన్ కథ అందించారు. ఇది మిథాలి రాజ్ జీవితంలోని హెచ్చు తగ్గులు, ఎదురుదెబ్బలు, ఆనందభరిత క్షణాలను చూపుతుంది. మిథాలి రాజ్ పాత్రను పోషించిన తాప్సీ పన్ను ఈ చిత్రం విడుదల తేదీని ట్విట్టర్‌లో పంచుకున్నారు.

‘కలలు కంటూ వాటిని సాకారం చేసుకునేందుకు ప్రణాళిక ఉన్న అమ్మాయి కంటే శక్తివంతమైనది మరొకటి లేదు! ఈ 'జెంటిల్‌మెన్ గేమ్'లో బ్యాట్‌తో తన కలను వెంబడించిన అలాంటి ఒక అమ్మాయి కథ ఇది. 15 జూలై 2022న మీ ముందుకొస్తోంది..’ అంటూ తాప్సీ తన పోస్ట్లో తెలిపింది.

క్రికెటర్ మిథాలీ రాజ్ 23 ఏళ్ల కెరీర్‌లో ఆమె వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలను సాధించింది. నాలుగు వరల్డ్ కప్‌లలో భారతదేశానికి నాయకత్వం వహించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది.

కోవిడ్ మహమ్మారి సమయంలో తాప్సీ పన్ను ‘హసీన్ దిల్ రుబా’, ‘అన్నాబెల్లె సేతుపతి’, ‘రష్మీ రాకెట్’, ‘లూప్ లపేట’ తదితర నాలుగు సినిమాలలో నటించినా అవి వివిధ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యాయి.

తాప్సీ పన్ను తన 2020 సంవత్సరపు చిత్రం ‘తప్పడ్’ థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ‘శభాష్ మిథు’ ద్వారా తాప్సీ పన్ను మళ్లీ థియేటర్లలో కనిపించనుంది. బాలీవుడ్లో దూసుకుపోతున్న తాప్సీకి (Taapsee Pannu) ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో తెలియాలంటే జూలై 15 వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!