Genelia: సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టబోతున్న జెనీలియా!
మంచు విష్ణు-జెనిలియా (Genelia) జంటగా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన `ఢీ` సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన అవసరంలేదు. దివంగత నటుడు శ్రీహరి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించగా.. హీరో కాకముందు నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయటం విశేషం. ఆద్యంతం కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇక, అప్పటికే బొమ్మరిల్లు హాసినిగా తెలుగు ప్రేక్షకుల్లో ముద్ర వేసిన (Genelia) జెనీలియా.. ఢీ సక్సెస్ తర్వాత తన కెరీర్ గ్రాఫ్ ను మరింత మెరుగు పరుచుకుంది. వరుస అవకాశాలతో అగ్రహీరోల సరసన ఛాన్సులు అందుకుంది. మరోవైపు కోలీవుడ్ లోనూ అదే వేవ్ లో చక్కని అవకాశాలు ఒడిసి పట్టుకుంది.
ఈ సినిమా ఏప్రిల్ 13, 2007లో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. విడుదలకు ముందు ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ లాంగ్ రన్ లో దాదాపు పదకొండు కోట్ల షేర్ ను రాబట్టింది. కోన వెంకట్, గోపి మోహన్ ల పంచ్ డైలాగులు, బ్రహ్మానందం, విష్ణుల కామెడీ, శ్రీను వైట్ల మూవీ టేకింగ్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. కాగా, ఢీ మూవీ పోస్టర్స్ లో ఒక ఫోజు బాగా పాపులర్ అయింది. ఈ మధ్యనే కలుసుకున్న మంచు విష్ణు, జెనీలియాలు (Genelia) రీ క్రియేట్ చేసారు. జిమ్ లో ఈ ఇద్దరు కలిసిన సందర్భంలో చేతులు పైకెత్తి కండలు చూపించే ప్రయత్నం చేసారు. సినిమాలోని ఆనాటి స్టిల్ ని..ఈ కొత్త ఫోటోకు జోడించి నెట్టింట షేర్ చేసారు. ''నా టింకర్ బెల్, నేను' అని విష్ణు క్యాప్షన్ ఇచ్చారు. మేము ఇద్దరం ఇంకా అలాగే ఉన్నాం. ఎలాంటి మార్పు రాలేదు' అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ ఫోటోని జెనిలియా ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం జెనీలియా ముంబయిలో స్థిరపడిన సంగతి తెలిసిందే.