అతను వచ్చాక నా జీవితం పూర్తిగా మారిపోయింది : అవికా గోర్ (Avika Gor) భావోద్వేగ పోస్ట్!

Updated on Jun 28, 2022 03:34 PM IST
ప్రియుడితో అవికాగోర్ (Avika Gor with her Lover)
ప్రియుడితో అవికాగోర్ (Avika Gor with her Lover)

Avika Gor: అవికా గోర్ బుల్లితెరపై ప్రసారమైన 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి. ఈ సీరియల్‌తో దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకుంది అవికా గోర్. ఆ తర్వాత తెలుగులో 'ఉయ్యాల జంపాల' సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. 

అవికా గోర్ నటిగా కొంత గ్యాప్‌ వచ్చిన కూడా..  ఇప్పుడు మళ్లీ పుంజుకుంది.  ప్రస్తుతం శ్రీరామ్‌తో కలిసి `టెన్త్ క్లాస్‌ డైరీస్‌` (10th Class Diarys) లో నటిస్తుంది. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకంపై అచ్యుత రామారావు .పి. రవితేజ మన్యం సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ  చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూలై 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

'టెన్త్ క్లాస్‌ డైరీస్‌' పోస్టర్ (10th Class Diarys Poster)

ఇక, తాజాగా నాగచైతన్య నటించిన థాంక్యూ (Thank You Movie) చిత్రంలో కూడా అవికా గోర్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. కేవలం నటిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అవికా గోర్ 2 సంవత్సరాల క్రితం తన ప్రియుడు మిలింద్‌ను పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే. ఎప్పుడంటే అప్పుడు తనతో పెళ్ళికి  తాను సిద్ధంగా ఉన్నానని ఈమె తన ప్రియుడు గురించి పలుమార్లు వెల్లడించారు. 

తాజాగా టెన్త్‌ క్లాస్‌ డైరీస్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా,  తన ప్రియుడి గురించి చెప్పింది అవికా గోర్.  తన ప్రియుడు మిలింద్ (Avika gor Lover Milind) గురించి మాట్లాడుతూ.. "వ్యక్తిగత జీవితం చాలా సంతృప్తిగా ఉంది. మిలింద్‌తో ప్రేమ ప్రయాణం బాగుంది. నేను బరువు తగ్గడం నుంచి, నిర్మాతగా మారడం వరకూ తను నా ప్రతి అడుగులో తోడు ఉన్నాడు. నా గురించి అన్నీ తెలుసుకొని, నేనేం చేయగలనో తెలుసుకునేలా చేసి నాకు మరింత సపోర్ట్‌గా నిలిచాడు మిలింద్. తన పరిచయం తర్వాత నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది" అని అవికా తెలిపింది.

 

"నా జీవితంలోకి మిలింద్ (Milind) వచ్చిన తర్వాత, నిజంగానే నా జీవితం పూర్తిగా మారిపోయింది. మిలింద్ నాలో ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపారు. అతను లేకుండా నేను ఇంత ప్రయాణం చేసేదాన్ని కాను.

నాలో ఎంతో ప్రోత్సాహాన్ని నింపి, నన్ను ముందుకు నడిపించడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. నేను వేసే ప్రతి అడుగులోనూ మిలింద్ నాతో ఉన్నాడు" అని తన ప్రియుడి గురించి ఎమోషనల్ కామెంట్ చేశారు అవికా గోర్.

ప్రస్తుతం అవికా గోర్ (Avika Gor) చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే ఒకప్పుడు ఎంతో బొద్దుగా, ముద్దుగా ఉన్నటువంటి ఈమె.. ప్రస్తుతం ఎంతో నాజూగ్గా మారిపోయారు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న అవికా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూనే తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

Read More: Avika Gor: అందం, అభినయంతో అదరగొడుతున్న 'చిన్నారి పెళ్లి కూతురు' అవికాగోర్..!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!