నాగచైతన్య (Naga Chaitanya) ‘థ్యాంక్యూ’ సినిమా నుంచి మరో సింగిల్.. ‘ఫేర్‌‌వెల్‌’ పాట రిలీజ్‌ ఎప్పుడంటే?

Updated on Jun 26, 2022 06:47 PM IST
నాగచైతన్య థ్యాంక్యూ సినిమాలోని ఫేర్‌‌వెల్‌ సాంగ్ రిలీజ్ పోస్టర్
నాగచైతన్య థ్యాంక్యూ సినిమాలోని ఫేర్‌‌వెల్‌ సాంగ్ రిలీజ్ పోస్టర్

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya).. తన నటన, అభినయంతో అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నాడు. 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' వంటి వరుస హిట్లతో జోరు మీదున్న చైతన్య తాజాగా హ్యాట్రిక్‌పై కన్నేశాడు. ప్రస్తుతం నాగచైతన్య నటించిన 'థ్యాంక్యూ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది.

ఈ క్రమంలో వరుస అప్‌డేట్లు ఇస్తూ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌‌, పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా మరో పాటను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ‘థ్యాంక్యూ’ సినిమాలోని ‘ఫేర్‌వెల్’ అంటూ సాగే హార్ట్‌ టచింగ్‌ పాటను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఫేర్‌‌వెల్‌ పాటను రిలీజ్‌ చేయనున్నారు.

నాగచైతన్య థ్యాంక్యూ సినిమా పోస్టర్

టీజర్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్..

ఇది వరకే థ్యాంక్యూ సినిమా నుంచి విడుదలైన 'ఏంటో ఏంటేంటో', 'మారో మారో' పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికా గోర్ నటించారు. ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందించిన థ్యాంక్యూ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌పై దిల్‌ రాజు, శిరీష్ నిర్మించారు.

ఇక, థ్యాంక్యూ సినిమాలో మహేష్‌బాబు ఫ్యాన్‌గా నాగచైతన్య కనిపించనున్నాడని సమాచారం. అలాగే పలు సన్నివేశాల్లో కాలేజీ స్టూడెంట్‌గా, ప్లేయర్‌‌గా, బిజినెస్‌ మ్యాన్‌గా కూడా కనిపించి మెప్పించనున్నాడని టీజర్‌‌ చూస్తే తెలుస్తోంది. మిడిల్‌ క్లాస్‌ నుంచి పెద్ద బిజినెస్‌ మ్యాన్‌గా ఎదిగిన తీరును.. ఆ తర్వాత జీవితంలో తను అభివృద్ధి చెందడానికి సహకరించిన వారిని కలిసి నాగచైతన్య (Naga Chaitanya) ధన్యవాదాలు చెప్పే కథాంశంతో ‘థ్యాంక్యూ’ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

Read More : ‘హిట్‌’ సీక్వెల్‌లో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani).. ఫ్యాన్స్‌ను సర్‌‌ప్రైజ్ చేయనున్నాడా?

నాగచైతన్య థ్యాంక్యూ సినిమా పోస్టర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!