Balakrishna: కల్యాణ్‌రామ్‌ బింబిసార సినిమాపై బాలకృష్ణ ప్రశంసలు..ఫ్యామిలీతో కలిసి థియేటర్లో సినిమా చూసిన బాలయ్య

Updated on Aug 14, 2022 11:20 PM IST
కల్యాణ్‌రామ్  హీరోగా నటించిన బింబిసార సినిమాను బాలకృష్ణ (BalaKrishna) ఫ్యామిలీతోపాటు థియేటర్‌‌లో చూశారు.
కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాను బాలకృష్ణ (BalaKrishna) ఫ్యామిలీతోపాటు థియేటర్‌‌లో చూశారు.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ టైం ట్రావెల్ సినిమా బింబిసార సినిమాపై నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బింబిసార సినిమాలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మేనన్‌ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లతో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

కల్యాణ్‌రామ్  హీరోగా నటించిన బింబిసార సినిమాను బాలకృష్ణ (BalaKrishna) ఫ్యామిలీతోపాటు థియేటర్‌‌లో చూశారు.

చిరు కూడా..

మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బింబిసార సినిమా చూసి ప్రశంసించారు కూడా. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌‌లో బింబిసార సినిమా చూశారు నందమూరి బాలకృష్ణ.

సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. అంతేకాదు బింబిసార సినిమా ఒక అద్భుతసినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా చూసిన అనంతరం బాలయ్య చిత్ర బృందాన్ని అభినందించడమే కాకుండా అద్భుతమైన ప్రయత్నం అంటూ ప్రశంసలు కురిపించారు.

ఇక, బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బిజీ కానున్నారు బాలయ్య. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న బాలకృష్ణ (Balakrishna) అన్ స్టాపబుల్ సీజన్2 షూటింగ్‌లో బిజీ కానున్నారు.

Read More : బాల‌కృష్ణ (Balakrishna) సినిమాకు సై అంటున్న‌ బాలీవుడ్ హీరోయిన్!.. ఇదంతా అనిల్ రావిపూడి ప్లానేనా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!