Nandamuri Balakrishna : బాలయ్య బాబు మంచి మనసుకు నిదర్శనమిదే.. అభిమానితో కలిసి భోజనం చేసిన నందమూరి నట సింహం !

Updated on Oct 21, 2022 12:00 PM IST
బాలకృష్ణ (Bala Krishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు
బాలకృష్ణ (Bala Krishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna).. ఈ పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే. ఆయనకు కోపం ఎంత ఉంటుందో.. ప్రేమ కూడా అంత‌కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే చాలా సంద‌ర్భాల్లో అది రుజువైంది కూడా. తాజాగా బాల‌య్య చేసిన ప‌నికి అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలయ్య అంటే అది అని ఆయనను పొగ‌డ్తల‌తో ముంచెత్తుతున్నారు.

స్టార్‌‌ హీరో అయిన బాలకృష్ణ ఇంత సింపుల్‌గా ఉంటారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత‌కీ బాల‌య్య చేసిన ప‌నేమిటో తెలుసా? తాజాగా ఆయన ఓ అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్‌లో వైర‌ల్‌ అవుతోంది. అలాగే ఓ కార్యక్రమంలో తనను ఎంత అభిమానించే ఓ సీనియర్ సిటిజన్ పక్కన కూడా కూర్చొని, ఆమె కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో కూడా వైరల్‌గా మారింది. 

బాలకృష్ణ (Bala Krishna), బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా పోస్టర్

గతంలో మాట.. ఇప్పుడు గుర్తుపెట్టుకుని మరీ..

బాల‌కృష్ణ (Balakrishna) గ‌తంలో ఓ అభిమానితో ముచ్చటిస్తూ.. "తన ఇంటికి వచ్చి క‌లుస్తా" అని మాటిచ్చారు. అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఆ అభిమానికి స్వయంగా ఫోన్ చేసి పిలిచారు. వాళ్ల కుటుంబంతో క‌లిసి భోజ‌నం చేశారు. వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడారు కూడా. ఆ వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. దాంతో బాల‌కృష్ణ అభిమానులు తమ అభిమాన హీరోని కొనియాడుతున్నారు. 

ప్రస్తుతం బాలకృష్ణ, గోపిచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క‌ర్నూల్‌లో జ‌రుగుతోంది. ‘అఖండ’ వంటి బ్లాక్‌బ‌స్టర్ త‌ర్వాత ఈ తెర‌కెక్కుతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన బాల‌య్య పోస్టర్లు, ఆ చిత్రం సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ చిత్రంలో బాల‌కృష్ణ (Balakrishna) సరసన శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read More : 75వ సినిమా కోసం 3 నెలల డేట్స్ కేటాయించిన నయనతార (Nayanthara).. ఎంత రెమ్యునరేషన్‌ తీసుకోనున్నారంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!