Bhool Bhulaiyaa 2: భారీ క‌లెక్ష‌న్‌తో జాక్ పాట్ కొట్టేసిన‌ బాహుబ‌లి డిస్ట్రిబ్యూట‌ర్‌!

Updated on Jun 28, 2022 09:42 PM IST
Bhool Bhulaiyaa 2: అనిల్ థ‌డ‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. భూల్ భూల‌య్యా 2తో జాక్ పాట్ త‌గిలింది. 
Bhool Bhulaiyaa 2: అనిల్ థ‌డ‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. భూల్ భూల‌య్యా 2తో జాక్ పాట్ త‌గిలింది. 

Bhool Bhulaiyaa 2: బాహుబ‌లి సినిమాలు ప్ర‌భాస్‌కు ఓ రేంజ్‌లో పేరు తెచ్చిపెట్టాయి. ఏకంగా పాన్ ఇండియా హీరోగా ప్ర‌భాస్‌ను మార్చేశాయి. బాహుబ‌లి సినిమాలు హిందీలోనూ మంచి క‌లెక్షన్లు రాబ‌ట్టాయి. అనిల్ థ‌డ‌ని బాహుబ‌లి హిందీ వ‌ర్ష‌న్‌ డిస్ట్రిబ్యూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అనిల్ థ‌డ‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. భూల్ భూల‌య్యా 2తో జాక్ పాట్ త‌గిలింది. 

కార్తీక్ ఆర్య‌న్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం భూల్ భూల‌య్యా 2. ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఈ సినిమాతో మ‌రోసారి  బాహుబ‌లి డిస్ట్రిబ్యూట‌ర్ అనిల్ థ‌డ‌ని జాక్ పాట్ కొట్టేశాడు. భూల్ భూల‌య్యా 2 (Bhool Bhulaiyaa 2) హార్ర‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.  5 వారాల్లో రూ.180 కోట్లు వ‌సూళ్లు చేసింది.

భూల్ భూల‌య్యా 2 (Bhool Bhulaiyaa 2) ముంబైలో రూ.55 కోట్లు వ‌సూళ్లు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఢిల్లీ, యూపీ బెల్ట్‌లో రూ.45 కోట్లు రాబట్టింది. వసూళ్ల ప‌రంగా కోట్ల రూపాయ‌ల‌ను రాబ‌డుతుంది. దీంతో బాహుబ‌లి డిస్ట్రిబ్యూట‌ర్ అనిల్ థ‌డ‌నికి విప‌రీత‌మైన లాభాలు వ‌చ్చాయట‌. ప్ర‌స్తుతం ఈ న్యూస్ బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  నిర్మాత భూష‌ణ్ కుమార్ ఐదు కోట్ల రూపాయ‌ల కారును కార్తీక్ ఆర్య‌న్‌కు బ‌హుమ‌తిగా ఇచ్చార‌ట‌. 

Read More: Telugu Movies: బాలీవుడ్‌లో తెలుగోడి స‌త్తా .. హిందీలో అత్య‌ధిక వ‌సూళ్లును సాధించిన‌ టాప్ 10 తెలుగు సినిమాలు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!