ప్ర‌భాస్ (Prabhas) ఆదిపురుష్ 3D సినిమాగా రిలీజ్

Updated on May 15, 2022 10:58 AM IST
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ 3D సినిమాగా ప్ర‌పంచ వ్యాప్తంగా 2023 జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్నారు.
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ 3D సినిమాగా ప్ర‌పంచ వ్యాప్తంగా 2023 జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) "ఆదిపురుష్" సినిమా తీస్తున్నారు. హై బ‌డ్జెట్‌తో ఆది పురుష్ తెరకెక్కుతుంది. 

ప్ర‌భాస్ సినిమా ఆదిపురుష్ (Adipurush) స‌రికొత్త హంగుల‌తో రిలీజ్ కానుంది. ఆదిపురుష్ 3D సినిమాగా ప్ర‌పంచ వ్యాప్తంగా 2023 జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్నారు. మైథ‌లాజిక్ మూవీగా ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్ట‌ర్  ఓం రౌత్ నిర్మిస్తున్నారు. 

 ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్

 ప్రభాస్‌కు జోడిగా బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. ఇక విల‌న్ రోల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు.  రాముడి పాత్రలో ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఆదిపురుష్‌లో ఇంకా ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారో చూడాలి. 

ఆదిపురుష్ సినిమాలో రాముడి అవ‌తారంలో ప్రభాస్ (Prabhas) 8 అడుగుల ఎత్తులో కనిపిస్తారట‌. రాముడిగా ప్ర‌భాస్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేలా మేక‌ప్ సెట్ చేశార‌ట‌. బాహుబలి కంటే 10 రెట్లు ఎక్కువ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌తో ఆదిపురుష్ సినిమా తీస్తున్నారు. T-సిరీస్ , రెట్రోఫిల్స్ రూ. 400 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఆదిపురుష్ డబ్బింగ్ వెర్షన్ కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!