భారీ మొత్తంలో డబ్బులిచ్చినందుకే అవార్డు.. హీరోయిన్ సమంత (Samantha) కామెంట్స్‌ వైరల్‌ !

Updated on Jul 25, 2022 02:00 PM IST
కాఫీ విత్ కరణ్‌ షోలో కరణ్‌ జోహార్‌‌ సమంత (Samantha) ను ఇంటర్వ్యూ చేశారు
కాఫీ విత్ కరణ్‌ షోలో కరణ్‌ జోహార్‌‌ సమంత (Samantha) ను ఇంటర్వ్యూ చేశారు

'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు హీరోయిన్ సమంత (Samantha). అప్పటి నుంచి తన అందం, అభినయంతో టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లో కూడా మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సమంత. ఈ సిరీస్‌లో చేసిన బోల్డ్ క్యారెక్టర్‌‌కుగాను విమర్శలు ఎదుర్కొన్నారు కూడా.

అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇటీవలే విడాకులు కూడా తీసుకున్నారు సమంత. విడాకుల తర్వాత ఆమె క్రేజ్ తగ్గుతుందని, కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతుందని అనుకున్నారు అందరూ. అయితే అందుకు విరుద్ధంగా సమంత మరింత స్పీడ్‌గా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. తాజాగా 'కాఫీ విత్ కరణ్‌ షో'లో పలు కామెంట్లు చేశారు సమంత. ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సమంత (Samantha)

నిజం చెప్పాలంటే అంటూ సరదాగా..

మోస్ట్ పాపులర్ హీరోయిన్లు ఎవరనే దానిపై ఆర్‌‌ మ్యాక్స్ సంస్థ చేసిన సర్వేలో నంబర్ వన్ స్థానంలో నిలిచారు సమంత. ఆమె తర్వాతి స్ధానాల్లో బాలీవుడ్ హీరోయిన్లు అలియా భట్, నయనతార, కరీనాకపూర్, పూజా హెగ్డే నిలిచారు.

ఇటీవలే 'కాఫీ విత్‌ కరణ్‌ షో'కు హాజరైన సమంతను 'ఆర్‌ మ్యాక్స్‌ సంస్థ సర్వేలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఎలా దక్కించుకున్నారు' అని బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ ప్రశ్నించారు. 'నిజం చెప్పనా' అంటూ.. తాను ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చానని సమాధానం చెప్పారు సమంత. అయితే ఆమె సరదాగానే ఆ కామెంట్లు చేసినప్పటికీ, ఇప్పుడు వాటిపై పెద్ద దుమారమే రేగుతోంది. చూడాలి మరి.. సమంత (Samantha) చేసిన ఈ కామెంట్లు ఎంతవరకు వెళతాయో !

Read More : ఆ విషయంలో కూడా టాప్‌లోనే రజినీ కాంత్ (Rajinikanth) .. సూపర్‌‌స్టార్‌‌కు మరో అవార్డు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!