నాగచైతన్యతో విడాకులపై ‘కాఫీ విత్ కరణ్‌’ షోలో సమంత (Samantha) కామెంట్లు.. అక్షయ్‌ కుమార్‌‌తో కలిసి సందడి

Updated on Jul 22, 2022 11:46 AM IST
కాఫీ విత్ కరణ్‌ షోలో సందడి చేసిన అక్షయ్ కుమార్, సమంత రుత్ ప్రభు (Samantha)
కాఫీ విత్ కరణ్‌ షోలో సందడి చేసిన అక్షయ్ కుమార్, సమంత రుత్ ప్రభు (Samantha)

సమంత (Samantha).. సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు.  'ఏ మాయ చేశావే' సినిమాతో కుర్రకారు గుండెలను మాయ చేశారు ఈ భామ. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్నారు.

ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు సమంత. తాజాగా బాలీవుడ్‌ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్​’కు అక్షయ్‌ కుమార్‌‌తో కలిసి హాజరై సందడి చేశారు.

బాలీవుడ్‌లోని పాపులర్ షోలలో 'కాఫీ విత్ కరణ్‌' కూడా ఒకటి. ఈ షో 7వ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. కరణ్​ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్‌’ షోకు వచ్చే సెలబ్రిటీలు ఎంతో సరదాగా సమాధానాలిస్తుంటారు. ఇటీవలే బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ కూడా ఈ షోకు వచ్చి సందడి చేశారు.

ఇక, తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, హీరోయిన్ సమంత ఈ షోకు వచ్చారు. ఆ షోలో సమంత తన వ్యక్తిగత విషయాలపై  పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం..

కాఫీ విత్ కరణ్‌ షోలో సందడి చేసిన అక్షయ్ కుమార్, సమంత రుత్ ప్రభు (Samantha)

మాజీ భర్త అంటూ..

‘కాఫీ విత్ కరణ్‌’ షోలో 'మీ భర్త నాగచైతన్య నుంచి విడాకులు. ?.' అని కరణ్‌ అడిగిన ప్రశ్న పూర్తవ్వక ముందే, సమంత కలగజేసుకుని ‘మాజీ భర్త’ అని అన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత తామిద్దరం చాలా బాధపడ్డామని తెలిపారు సమంత.

రూ.250 కోట్లు భరణం

'విడాకుల సమయంలో చైతూ నుంచి భరణంగా రూ.250 కోట్లు తీసుకున్నాననే పుకార్లు వచ్చాయి. రూ.250 కోట్లను ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు దొరకకుండా ఎలా దాచగలను. అది అంత చిన్న మొత్తం కాదని మీడియా తెలుసుకున్నప్పుడు, ఈ రూమర్స్ వాటంతట అవే మాయమైపోతాయి. భరణంగా రూ.250 కోట్లు తీసుకున్నానని వచ్చిన ఈ సోషల్ మీడియా ట్రోల్స్‌.. నాకు ఇష్టమైన ట్రోల్స్' అని నవ్వుతూ చెప్పారు సమంత.

ఇప్పటికీ కష్టంగానే..

చైతూ నుంచి విడిపోయిన తర్వాత జీవితం చాలా కష్టంగా మారిందని అన్నారు సమంత. అయితే ఇప్పుడు కొంచెం బాగానే ఉందని, ఎప్పుడూ లేనంత మనోధైర్యంతో ఇప్పుడు ఉన్నానని సమంత  అన్నారు. తమ ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మాత్రం, అక్కడ ఉండే పదునైన వస్తువులను ఎవరైనా దాచిపెట్టాలని నవ్వుతూ చెప్పారు.

ఫ్యూచర్‌‌ గురించి చెప్పలేను..

ప్రస్తుతం నాగచైతన్యకు, తనకు మధ్య స్నేహపూర్వక బంధం కూడా లేదని అన్నారు సమంత. 'మీ ఇద్దరికీ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా' అని కరణ్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానమిచ్చారు. అయితే 'భవిష్యత్తులో స్నేహంగా ఉండగలమేమో' అని కూడా అన్నారు. మొత్తానికి ‘కాఫీ విత్ కరణ్‌’ షోలో తన వ్యక్తిగత విషయాలపై సమంత (Samantha) బాగానే స్పందించారని తెలుస్తోంది.

Read More : ‘ప్రాజెక్ట్‌ K’ సినిమా సెట్‌ నుంచి లంబోర్గిని కారులో దూసుకెళ్లిన ప్రభాస్‌ (Prabhas).. వీడియో వైరల్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!