ఆ విషయంలో కూడా టాప్‌లోనే రజినీ కాంత్ (Rajinikanth) .. సూపర్‌‌స్టార్‌‌కు మరో అవార్డు

Updated on Jul 24, 2022 08:44 PM IST
ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ను (Rajinikanth) అవార్డుకు ఎంపిక చేసింది.
ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ను (Rajinikanth) అవార్డుకు ఎంపిక చేసింది.

స్టైల్, యాక్షన్, క్లాస్, మాస్ ఇలా అన్నింటిలోనూ టాప్‌లో ఉండే హీరో రజినీ కాంత్ (Rajinikanth). అందుకే ఆయన సూపర్‌‌స్టార్ అయ్యారు. రజినీ కాంత్‌కు నటనలో అవార్డులు కొత్త కాదు. ఆయన అద్భుత నటనకు ఎన్నో అవార్డులు అందుకున్నారు రజినీ. ఇక, ఈసారి మాత్రం మరో అవార్డుకు ఎంపికయ్యారు సూపర్‌‌స్టార్.

తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా రికార్డులోకెక్కి అవార్డును సొంతం చేసుకున్నారు రజినీ కాంత్. ఆదివారం ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. అయితే ఈ అవార్డును అందుకోవడానికి రజినీ కాంత్ హాజరు కాలేదు. సూపర్‌‌స్టార్ తరఫున ఆయన కూతురు ఐశ్వర్యా రజినీకాంత్‌ కార్యక్రమానికి హాజరై అవార్డును అందుకున్నారు.

అవార్డు అందుకుంటున్న రజినీకాంత్ కూతురు ఐశ్వర్యా రజినీకాంత్

తెలంగాణ గవర్నర్, మద్రాస్ హైకోర్టు సీజే చీఫ్ గెస్ట్‌లుగా..

అవార్డు ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ హాజరయ్యారు. మద్రాస్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మునీశ్వర్‌‌నాథ్‌ భండారీ కూడా అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు.   

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ సినిమా షూటింగ్‌ సెట్స్‌పై ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు రజినీకాంత్ (Rajinikanth). అందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని సమాచారం. శివరాజ్‌కుమార్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, శివకార్తికేయన్, ప్రియాంక అరుల్‌ మోహన్, యోగి బాబు, రమ్యకృష్ణ తదితరులు జైలర్‌‌ సినిమాలో కీలకపాత్రల్లో నటించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు పూర్తి అధికారిక ప్రకటన వెలువడలేదు.  

Read More : త్వరలో సెట్స్‌పైకి అడివి శేష్‌ (Adivi Sesh) హిట్‌2 సినిమా ఫైనల్‌ షెడ్యూల్ షూటింగ్..పిక్ రిలీజ్ చేసిన యంగ్ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!