Avatar: The Way of Water: జేమ్స్ కామెరాన్‌కు 'అవతార్ 2' చిత్రం ఎందుకంత ప్రత్యేకమైందో తెలుసా!

Updated on Dec 14, 2022 05:07 PM IST
 హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సీక్వెల్‌గా చిత్రీకరించిన రెండవ సినిమా 'అవతార్ - ద వే ఆఫ్ వాటర్‌' (Avatar : The Way of Water).
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సీక్వెల్‌గా చిత్రీకరించిన రెండవ సినిమా 'అవతార్ - ద వే ఆఫ్ వాటర్‌' (Avatar : The Way of Water).

Avatar: The Way of Water: 'అవతార్' సినిమా ప్రపంచ స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా సీక్వెల్‌ను 13 ఏళ్ల తరువాత దర్శకుడు, రచయిత జేమ్స్ కామెరాన్ 'అవతార్ - ద వే ఆఫ్ వాటర్' (Avatar: The Way of Water) పేరుతో డిసెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. జేక్ సల్లీ, నేత్రీల కుటుంబ సభ్యుల కథను 'అవతార్ 2' చిత్రంలో చూపించనున్నారు. సముద్రంలో సాగే కథ 'అవతార్ - ద వే ఆఫ్ వాటర్‌' చిత్రం కోసం జేమ్స్ కామెరాన్‌ చేసిన హార్డ్ వర్క్‌పై పింక్ విల్లా ప్రత్యేక కథనం..

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

అమెరికన్ ఫేమస్ రచయిత ఎడ్గార్ రైస్ బరోస్ రాసిన సైన్స్- ఫ్రిక్షన్ కథల పుస్తకాలను దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన చిన్నతనంలో ఎక్కువగా చదివేవారు.  రైస్ బరోస్ టార్జాన్, ఎడ్వంచర్, థ్రిల్లర్ కథలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎడ్గార్ రైస్ బరోస్ రాసిన జాన్ కార్టర్ కథలంటే జేమ్స్‌కు చాలా ఇష్టం.

రైస్ బరోస్ 'ఏ ప్రిన్స్‌స్ ఆఫ్ మార్స్' అనే సైన్స్- ఫ్రిక్షన్  పుస్తకాన్ని రాశారు. ఈ కథకు కొనసాగింపుగా మరో 11 పుస్తకాలు రచించారు. ముగింపు కథతో 11 వ సిరీస్ 'జాన్ కార్టర్ ఆఫ్ మార్స్' అప్పట్లో విపరీతమైన జనాదారణ పొందింది. ఈ పుస్తకాలను ఎక్కువగా చదివిన జేమ్స్ కామెరాన్ మనసులోంచి పుట్టిన ఆలోచనే 'అవతార్' సినిమా.

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

జేమ్స్ కామెరాన్ 'టెర్మినేటర్' సినిమా సీక్వెల్‌గా 'టెర్మినేటర్ 2 - జడ్జిమెంట్ డే'ను రూపొందించారు. కామెరాన్ సీక్వెల్‌గా చిత్రీకరించిన రెండవ సినిమా 'అవతార్ - ద వే ఆఫ్ వాటర్'.

'టైటానిక్' సినిమాకు జేమ్స్ కామెరాన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 'టైటానిక్‌' పడవ సముద్రంలో మునిగిపోయే సీన్లు అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఆ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. కామెరాన్‌కు నీటిలో టెక్నాలజీ ఉపయోగించి సినిమా తీయాలనే డ్రీమ్ ఉండేదట. ఆ డ్రీమ్  "అవతార్ 2" (Avatar : The Way of Water)తో నెరవేరబోతుంది.

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

'అవతార్ 2' స్క్రిప్ట్ కోసం దర్శకుడు ఆరు నెలలు హార్డ్ వర్క్ చేశారు. ఎనిమిది వందల పేజీల నోట్స్ రాసుకున్నారు.జేమ్స్ కామెరాన్ మొదట తన టీమ్‌తో 'అవతార్' సినిమాలోని పాత్రల ప్రభావం ఎలా ఉన్నాయనే దానిపై చర్చలు జరిపారట. 'అవతార్ 2' లోని పాత్రలు ప్రేక్షకులకు మరింత నచ్చేలా రూపొందించామని జేమ్స్ తెలిపారు. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

'అవతార్' సినిమా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మాన్‌హట్టన్ బీచ్ స్టూడియోస్‌ (MBS) లో షూటింగ్ జరిగింది. ఈ సినిమా సీక్వెల్స్ కోసం 22 ఎకరాల మాన్ హట్టన్ బీచ్ స్టూడియోస్‌లో 15 సెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. లైట్ స్ట్రోమ్ స్టేజ్‌లను కొన్నేళ్ల పాటు జేమ్స్ కామెరాన్ లీజుకు తీసుకున్నారు.

'అవతార్ 2' సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత జేమ్స్ అండ్ టీమ్ న్యూజిలాండ్‌కు మకాం మార్చింది. ఆరు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను న్యూజిల్యాండ్‌లో నిర్వహించారు. 

Read More: Avatar: The Way of Water: 'అవతార్2' లో కొత్త పాత్రలను పరిచయం చేయనున్న దర్శకుడు జేమ్స్ కామెరాన్

 
 
నేను చిన్పప్పటి నుంచి సముద్రాన్ని ప్రేమిస్తున్నాను. గత 16 ఏళ్లగా స్కూబా డ్రైవింగ్ చేస్తున్నారు. నేను నీటి అడుగున కొన్ని వందల గంటలు గడిపాను. సముద్రం అడుగు భాగాన ఉన్న అందమైన ప్రదేశాలు క్షీణిస్తున్నాయి. మనం చేసే పనుల వల్ల సముద్రం ఎంత బాధపడుతుందో నేను చూశాను. సముద్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని నేను భావిస్తున్నాను.   
జేమ్స్ కామెరాన్‌
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!