ఏఆర్ రెహ‌మాన్ (A. R. Rahman) పెద్ద‌ కూతురు ఖ‌తీజా పెళ్లి వీడియో 

Updated on Jun 15, 2022 04:37 PM IST
కూతురు ఖ‌తీజా పెళ్లి వీడియోను అభిమానుల కోసం రెహ‌మాన్  (A. R. Rahman)  త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
కూతురు ఖ‌తీజా పెళ్లి వీడియోను అభిమానుల కోసం రెహ‌మాన్ (A. R. Rahman) త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఆస్కార్ విన్న‌ర్, ఇండియ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్. రెహ‌మాన్ (AR Rahman) పాట‌ల‌కు ఉన్నక్రేజే వేరు. ఎ.ఆర్. రెహ‌మాన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఎ.ఆర్. రెహ‌మాన్ పెద్ద‌ కూతురు ఖ‌తీజా రెహ‌మాన్ వివాహం రీసెంట్‌గా జ‌రిగింది. ఈ మ్యూజిక్ లెజెండ్ త‌న కూతురు పెళ్లిని అంగ‌రంగ వైభవంగా చేశారు. ఆ మ్యారేజ్ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు రెహ‌మాన్ . 

సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పెళ్లి వేడుక
ఎ.ఆర్. రెహ‌మాన్ పెద్ద కూతురు వివాహం మే 5న జ‌రిగింది. ఆ వివాహానికి సంబంధించిన ఫోటోల‌ను కూడా రెహ‌మాన్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఖ‌తీజా పెళ్లి వేడుక‌ను సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో జ‌రిపారు. చెన్నైలో ఈ పెళ్లి వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌త పెద్ద‌ల మ‌ధ్య ఖ‌తీజా వివాహం జ‌రిపించారు.

అభిమానుల కోసం త‌న సోష‌ల్ మీడియా ద్వారా రెహ‌మాన్ త‌న కూతురి పెళ్లి వీడియోను పోస్ట్ చేశారు. భగవంతుడు త‌న కూతురును, అల్లుడ‌ని  ఆశీర్వదించాడని.. అభిమానులు కూడా ఆశీర్వ‌దించినందుకు ధ‌న్య‌వాదాలంటూ ఎ.ఆర్. రెహ‌మాన్ (AR Rahman) పోస్ట్ చేశారు. 

రెహ‌మాన్ (AR Rahman) కూతురి కోసం మ్యూజిక‌ల్ వెడ్డింగ్ రిసెప్ష‌న్ చెన్నైలో నిర్వ‌హించారు.

చెన్నైలో వెడ్డింగ్ పార్టీకి హాజ‌రైన సీఎం స్టాలిన్
ఎ.ఆర్. రెహ‌మాన్ (AR Rahman) త‌న‌ కూతురి వెడ్డింగ్ రిసెప్ష‌న్‌ను చెన్నైలో నిర్వ‌హించారు.ఈ వేడుక‌కు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ హాజ‌ర‌య్యారు. చెన్నైలోని ప్ర‌ముఖ సినీ తార‌లు కూడా ఈ రిసెప్ష‌న్‌కు వెళ్లారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు ఇళ‌య‌రాజ‌తో పాటు అత‌ని భార్య‌, న‌టి సుహాసిని ఆ పార్టీలో సంద‌డి చేశారు. ప్ర‌ముఖ న‌టి మ‌నిషా కోయిరాలా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించారు.

మాస్క్ ధ‌రించిన పెళ్లికూతురు
త‌న పెళ్లికి ఎవ‌రెవ‌రు ఏం చేశార‌నే విష‌యాల‌ను ఖ‌తీజా త‌న ఇన్ స్టాలో వెళ్ల‌డించారు. ఖ‌తీజా సింగ‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రోబో సినిమాలో ఓ మ‌ర‌మ‌నిషి పాట‌ను ఖ‌తీజానే పాడారు. కృతిస‌న‌న్ సినిమా మిమిలో కూడా రాక్ ఏ బై బేబీ అనే పాట‌ను పాడారు. ఈ పాట‌తో మంచి పేరు తెచ్చుకున్నారు ఖ‌తీజా రెహ‌మాన్. ఖ‌తీజా త‌న పెళ్లిలో, రిసెప్ష‌న్‌లో ముఖానికి మాస్క్ ధ‌రించే ఉన్నారు. ముస్లిం సంప్ర‌దాయంలో భాగంగా పెళ్లిలో అలా కనిపించారంటూ ఎ.ఆర్. రెహ‌మాన్ (AR Rahman) అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

Read More: మ్యూజిక్ బాస్ ఎ.ఆర్. రెహ‌మ‌న్ (AR Rahman) ఇంట్లో పెళ్లిసంద‌డి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!