మ్యూజిక్ బాస్ ఎ.ఆర్. రెహమన్ (AR Rahman) ఇంట్లో పెళ్లిసందడి
సంగీతం అంటేనే ఎ.ఆర్. రెహమాన్(AR Rahman). ఆస్కార్ సాధించిన మొదటి ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎ.ఆర్. రెహమానే. ప్రస్తుతం రెహమాన్ తన కూతురు పెళ్లిసందడిలో బిజిగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎ.ఆర్. రెహమాన్ కూతురు పెళ్లి పిక్స్‌ను పోస్ట్ చేశారు.
ఆస్కార్ అవార్డు అందుకున్న ఒకేఒక భారతీయ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్. ప్రపంచ వ్యాప్తంగా ఎ.ఆర్. రెహమాన్ సంగీతానికి అభిమానులు ఉన్నారు. బహుశా ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ ఒక్కరేనేమో. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలు చేశారు. మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తూ సంగీత ప్రియులకు ఆనందాన్నిస్తున్నారు. ఎన్నో వేల ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉండే రెహమాన్... ప్రస్తుతం కూతురు పెళ్లితో సంతోషంగా ఉన్నారు.
ఎ.ఆర్. రెహమాన్(AR Rahman) పెద్ద కూతురు ఖతీజా రెహమాన్ వివాహం ఏప్రిల్ 6 న జరిగింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశారు. ఆ భగవంతుడు తన కూతురును, అల్లుడని ఆశీర్వదించాడని.. అభిమానులు కూడా ఆశీర్వదించినందుకు ధన్యవాదాలంటూ ఎ.ఆర్. రెహమాన్ పోస్ట్ చేశారు.
ఖతీజా రెహమాన్ భర్త పేరు రియాస్దీన్ రియాన్. జీవితంలో ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూశానని... తన మనిషి రియాస్దీన్ రియాన్‌ను వివాహం చేసుకున్నానుంటూ ఖతీజా రెహమాన్ ఇన్ స్టాలో తెలిపారు. ఈ కొత్త జంటను చాలా మంది ప్రముఖులు విష్ చేస్తున్నారు.
ఎ.ఆర్.రెహమాన్ (AR Rahman) లానే తన కూతురు ఖతీజాకు పాటలంటే ప్రాణం. సేవ కార్యక్రమాలంటే ఖతీజకు ఇష్టం కూడా. తండ్రి స్థాపించిన సేవా సంస్థకు ఖతీజా రెహమాన్ డైరెక్టర్‌గా ఉన్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘మీమి’ చిత్రంలోని రాక్ ఏ బై బేబీ అనే పాట ఖతీజా పాడిందే. ఖతీజా భర్త కూడా ఆడియో ఇంజనీర్. ఎంట్రప్రెన్యూరర్‌గా కూడా ఖతీజా హస్బెండ్ రియాన్ సక్సెస్ సాధించారు. మ్యూజిక్ ఫ్యామిలీలోకి మ్యూజిక్ లవర్ రియాన్‌కు స్వాగతం అంటూ అభిమానులు విష్ చేస్తున్నారు.