Cannes Film Festival: ఆస్కార్ విజేత 'ఏఆర్ రెహ‌మాన్' డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమా

Updated on May 22, 2022 02:57 PM IST
 AR Rahman:  ఏఆర్ రెహ‌మాన్99 సాంగ్స్ అనే పాన్ ఇండియా సినిమాతో డైరెక్ష‌న్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం త‌న కొత్త సినిమాకు కన్ఫెష‌న్స్ టైటిల్ ఫిక్స్ చేశారు.
AR Rahman: ఏఆర్ రెహ‌మాన్99 సాంగ్స్ అనే పాన్ ఇండియా సినిమాతో డైరెక్ష‌న్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం త‌న కొత్త సినిమాకు కన్ఫెష‌న్స్ టైటిల్ ఫిక్స్ చేశారు.

ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ మాంత్రికుడు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు విజేత కూడా.  రెహ‌మాన్ మ్యూజిక్‌తో పాటు, ఈ మధ్యకాలంలో డైరెక్ష‌న్ కూడా చేస్తున్నారు. '99 సాంగ్స్' అనే పాన్ ఇండియా సినిమాతో దర్శకుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం త‌న కొత్త సినిమాకు 'కన్ఫెష‌న్స్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

భారతదేశంతో  పాటు ప్రపంచాన్ని మొత్తం, త‌న సంగీతంతో  క‌దిలించే స‌త్తా ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్. ఎన్నో  హిట్ సినిమాలకు సంగీతం అందించి, స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. మ్యూజిక్ విభాగంలో ఆస్కార్ పురస్కారాన్ని కైవసం చేసుకున్న మొద‌టి ఇండియ‌న్‌గా కూడా  రికార్డు క్రియేట్ చేశారు. 

ఇవన్నీ పక్కన పెడితే.. ఇటీవలి కాలంలో వర్చువల్‌ రియాలిటీ మూవీ 'లే మాస్క్' అనే చిత్రానికి కూడా రెహ‌మాన్ డైరెక్ష‌న్‌ వహించారు. ఈ చిత్రాన్ని 75 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో  ప్ర‌ద‌ర్శించారు.  75 నిమిషాల నిడివి ఉన్నఈ సినిమాని, అక్కడి వ్యూవర్స్‌ కోసం 36 నిమిషాలకు కుదించారు. రెహ‌మాన్ భార్య ఐడియాతో 'లే మాస్క్' సినిమా తెర‌కెక్కింది. 

'కన్ఫెషన్స్‌' టైటిల్‌తో మరో సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాన‌ని ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఇటీవలే  ప్రకటించారు. ఇటీవలి కాలంలో  సంగీత దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగా, డైరెక్టరుగా కూడా ఏఆర్ రెహ‌మాన్ రాణిస్తున్నారు. త‌్వరలో ప్రేక్ష‌కుల‌కు 'కన్ఫెషన్స్‌' అనే చిత్రం ద్వారా, ఓ కొత్త లోకాన్ని పరిచయం చేస్తానని ఏఆర్ రెహ‌మాన్ అన్నారు. ఇటీవలే ఏఆర్ రెహ‌మాన్ తన కూతురు వివాహ చిత్రాలను, త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం  రెహ‌మాన్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ వేడుక‌ల్లో సంద‌డి చేస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!