ఆది సాయికుమార్ (Aadi Saikumar) ‘తీస్‌మార్‌‌ఖాన్’ సినిమా నుంచి మరో సాంగ్.. పాయల్‌ ఆది కెమిస్ట్రీ అదిరింది

Updated on Jul 26, 2022 04:06 PM IST
ఆది సాయికుమార్ (Aadi Saikumar) ‘తీస్‌మార్‌‌ఖాన్’ సినిమాలోని పాటలో పాయల్‌ రాజ్‌పుత్
ఆది సాయికుమార్ (Aadi Saikumar) ‘తీస్‌మార్‌‌ఖాన్’ సినిమాలోని పాటలో పాయల్‌ రాజ్‌పుత్

డైలాగ్‌ కింగ్ సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిరు ఆది సాయికుమార్ (Aadi Saikumar). ప్రేమకావాలి సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టిన ఆది.. వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే కెరీర్‌‌ను నిలదొక్కుకునే హిట్‌ సినిమా ఆదికి దక్కలేదనే చెప్పాలి. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఆది సాయికుమార్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.

ఆది సాయికుమార్‌‌ హీరోగా విజన్ సినిమాస్ బ్యానర్‌‌పై తెరకెక్కుతున్న సినిమా ‘తీస్‌మార్‌‌ఖాన్’. పాయల్‌ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్‌, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఒక పాట రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. ఆగస్టు 19వ తేదీన తీస్‌మార్‌‌ఖాన్ సినిమా రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్.

ఆది సాయికుమార్ (Aadi Saikumar) ‘తీస్‌మార్‌‌ఖాన్’ సినిమా పోస్టర్

ఆర్‌‌ఎక్స్‌ 100ను గుర్తుచేసేలా..

ఈ సందర్భంగా తీస్‌మార్‌‌ఖాన్‌ సినిమా నుంచి మరో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘సమయానికే’ అంటూ సాగే ఈ రొమాంటిక్ వీడియో సాంగ్‌లో పాయల్‌.. మరోసారి ఆర్‌‌ఎక్స్‌100 సినిమాలోలా రొమాంటిక్‌గా కనిపించారు. రాకేందు మౌళి రచించిన ఈ పాటను శ్రుతి పాడారు. యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కించిన తీస్‌మార్‌‌ఖాన్‌ సినిమాలో ఆది సాయికుమార్ (Aadi Saikumar) పోలీసాఫీసర్‌‌గా నటించారు. కల్యాణ్‌ జి గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగం తిరుపతిరెడ్డి నిర్మించారు.

Read More : నటనలో అక్షరాభ్యాసం చేసింది బాలకృష్ణ బాబాయ్‌ : వీడియో రిలీజ్ చేసిన కల్యాణ్‌రామ్‌ (KalyanRam)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!