ఆది సాయికుమార్ (Aadi) ‘తీస్‌ మార్ ఖాన్’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ ఇవ్వనున్న మేకర్స్.. ఎప్పుడంటే?

Updated on Jul 08, 2022 02:19 PM IST
తీస్‌ మార్ ఖాన్' సినిమాలో ఆది సాయికుమార్‌ (Aadi)‌.. స్టూడెంట్‌, రౌడీ, పోలీస్ క్యారెక్టర్‌‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.
తీస్‌ మార్ ఖాన్' సినిమాలో ఆది సాయికుమార్‌ (Aadi)‌.. స్టూడెంట్‌, రౌడీ, పోలీస్ క్యారెక్టర్‌‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.

'ప్రేమ కావాలి' సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ (Aadi). ఫుల్‌ లెంగ్త్‌ లవ్ ఎంటర్‌‌టైనర్‌‌గా వచ్చిన ఆ సినిమాలో, ఆది నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా 'ప్రేమ కావాలి' సినిమా హిట్‌ టాక్‌ను కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత  ఆది చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హడావిడి చేయకపోయినా.. ఆది మాత్రం సినిమాలు చేస్తున్నాడు.

హిట్‌, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఆది చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘తీస్‌ మార్ ఖాన్’. కల్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్‌‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత 'తీస్‌ మార్ ఖాన్' సినిమాపై అంచనాలు పెరిగాయి.

‘తీస్‌ మార్ ఖాన్‌’ సినిమాలో ఆది సాయి కుమార్ (Aadi)

యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా..

ఆది సాయికుమార్ (Aadi) హీరోగా నటిస్తున్న 'తీస్‌ మార్‌‌ ఖాన్' సినిమా యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కింది. ఈనెల 27వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్లు ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడానికి ప్రయత్నిస్తోంది.  ఈ నేపథ్యంలోనే తీస్‌ మార్ ఖాన్ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

తీస్‌ మార్ ఖాన్ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను శుక్రవారం సాయంత్రం 5:04 నిమిషాలకు వెల్లడించనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఆర్‌‌ఎక్స్ 100, విక్టరీ వెంకటేష్‌తో వెంకీ మామా సినిమాల్లో నటించిన  పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న తీస్‌ మార్ ఖాన్ సినిమాలో సునీల్, పూర్ణ, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, 'తీస్‌ మార్ ఖాన్' సినిమాలో ఆది సాయికుమార్‌ (Aadi)‌.. స్టూడెంట్‌, రౌడీ, పోలీస్ క్యారెక్టర్‌‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.

 Read More :  ‘సలార్’ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది.. క్యారెక్టర్ గురించి ఇప్పుడే చెప్పలేను: శృతిహాసన్ (Shruti Haasan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!