ఆహా (Aha) ఓటీటీ నుంచి మరో రియాలిటీ షో.. ఓక్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌తో కలిసి ‘డ్యాన్స్ ఐకాన్’ను ప్రకటించిన సంస్థ

Updated on Jun 22, 2022 08:21 PM IST
డ్యాన్స్ ఐకాన్ షోను ప్రకటించిన అల్లు అరవింద్, ఓంకార్
డ్యాన్స్ ఐకాన్ షోను ప్రకటించిన అల్లు అరవింద్, ఓంకార్

అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే, తెలుగు ఇండియన్ ఐడల్‌ రియాలిటీ షోలను ‘ఆహా’ (Aha) సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేసింది. బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 1 పూర్తి కాగా.. సీజన్‌2 త్వరలోనే స్టార్ చేయనున్నట్టు ఆహా తాజాగా ప్రకటించింది. ఇక, తెలుగు ఇండియన్ ఐడల్ షో గ్రాండ్ ఫినాలే ఈ మధ్యనే జరిగింది. ఈ షో గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్‌ గెస్ట్‌గా హాజరై షోకు మరింత గ్లామర్ తెచ్చారు.

ఇది ఇలా ఉంటే.. ఈ రెండు షోలు ఘన విజయం సాధించడంతో మరో రియాలిటీ షోను ప్రారంభించాలని ప్లాన్ చేసింది ఆహా. ప్రముఖ యాంకర్‌‌ ఓంకార్‌‌తో కలిసి సరికొత్త షోను స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది ఓటీటీ సంస్థ ఆహా. ‘డాన్సింగ్ ఐకాన్’ అనే పేరుతో షోను ప్రసారం చేస్తున్నట్టు వెల్లడించింది. షోలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం ఈనెల 22వ తేదీ నుంచి ఆడిషన్స్‌ను సైతం ప్రారంభిస్తున్నామని చెప్పింది. డాన్సింగ్ ఐకాన్‌ అనే షోను ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించేశారు షో నిర్వాహకులు.

‘నెమలికి నేర్పిన నడకలివే’, ‘రారా..రారా రమ్మంటున్నా.. రణరంగంలో సిద్దంగున్నా.. చావో రేవో తేలాలిపుడే డాన్స్’ అనే పాటలతో సాగే పోటీలు. డాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న డ్యాన్సర్ బయటికొస్తారు. మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే ఆహా, ఓక్ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ కలిసి సమర్పిస్తున్న 'డాన్స్ ఐకాన్' అనే షో మీ కోసమే. మీ ప్రతిభకు మా వేదిక ఆహ్వానం పలుకుతోంది. ఇంకెందుకు ఆలస్యం, ఆడిషన్స్‌కు విచ్చేయండి. ప్రతిభ చూపించి డాన్స్ ఐకాన్ టైటిల్ గెలుచుకోండి.

అల్లు అరవింద్, ఓంకార్

ఆడిషన్స్‌ కూడా నేటి నుంచే..

జూన్ 22 నుంచి ప్రారంభయ్యే షో డిజిటల్ ఆడిషన్స్ జూలై 10 వరకు కొనసాగుతాయి. మీ వయసు 5 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండి, మీరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే చాలు. మీరు చేయాల్సిందల్లా.. 60 సెకండ్లు డ్యాన్స్‌ చేసిన వీడియోను danceikon@oakentertainments.comకు ఈ మెయిల్ చేయండి.

షో యాంకర్,  ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ..‘ఈ షో ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, ఆహా (Aha)కు ధన్యవాదాలు. చాలా డ్యాన్స్ షోలు చేశాను, అయితే ఇది వాటన్నింటి కంటే భిన్నమైనది. కంటెస్టెంట్లతో పాటు కొరియోగ్రఫీ చేసే మాస్టర్ల జీవితాల్ని కూడా మార్చేస్తుంది ‘డ్యాన్స్ ఐకాన్’ షో.  గెలిచిన కంటెస్టెంట్‌కు సంబంధించిన కొరియోగ్రాఫర్‌‌కు టాలీవుడ్‌లో పెద్ద హీరోకి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అది ఎవరు అనే విషయాన్ని ఫినాలేలో చెప్తాం.

Read More : Megastar Chiranjeevi: 'సూపర్ స్టార్' రజినీకాంత్ వాకింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. వీడియో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!