Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది..!

Updated on Jun 13, 2022 08:55 PM IST
తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol)
తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol)

Telugu Indian Idol: తెలుగు ప్రేక్ష‌కుల నుంచి ‘ఆహా’ ఓటీటీ (Aha OTT) సంస్థకు విశేష ఆదర‌ణ వ‌స్తోంది. సరికొత్త ప్రోగ్రామ్స్ తో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. ప్ర‌తి వారం ఓ కొత్త సినిమాను విడుద‌ల చేస్తూ.. సరికొత్త రియాలిటీ షోస్‌తో నిత్యం ఎంట‌ర్టైన్ చేస్తూ వ‌స్తుంది. ఇండియాలో ఎంతో పాపుల‌ర్ అయిన ‘ఇండియ‌న్ ఐడ‌ల్‌’ను అదే పేరుతో ఆహా సంస్థ సింగింగ్ రియాలిటీ షోను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు సింగర్స్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది సింగర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. 

ఆ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. జూన్ 17 నుంచి ఈ ఎపిసోడ్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్… వీళ్ళలో మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) టైటిల్ విజేత ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఫినాలే ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యి విన్నర్ ను అనౌన్స్ చేసినట్టు కూడా ఇందులో చూపించారు. అలాగే ‘విరాటపర్వం’ ప్రమోషన్లలో భాగంగా రానా, సాయి పల్లవి కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. 

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా మెగాస్టార్ అభిమానులు, ప్రేక్షకులు ఈ ప్రోమో చూసి అందులో బాస్ గ్రెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రోమో రిలీజ్ అయిన కొద్ది క్షణాలకే ట్రెండింగ్ లో ఉంది. ప్రోమో విషయానికి వస్తే :‘బాక్సాఫీస్ కి ‘ఘరానా మొగుడు’.. తెలుగు సినిమాకి ‘ఇంద్ర’ సేనుడు.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి వెల్కమ్’ అంటూ చిరుకి వెల్కమ్ చెప్పారు హోస్ట్ శ్రీరామ్ చంద్ర. 

ఈ ప్రోమోలో చిరంజీవి మంచి డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ అంతా కలిసి చిరు పాటలతో అదరగొట్టారు. ప్రణతి అనే కంటెస్టెంట్ వాళ్ళ అమ్మతో కలిసి ‘సందెపొద్దుల కాడ’ పాట పాడటంతో చిరంజీవి వారిద్దరితో కలిసి ఒక స్టెప్ వేశారు. అంతే కాకుండా ప్రణతి భవిష్యత్తులో పెద్ద సింగర్ అవుతుందని ఒక పెన్ గిఫ్ట్ గా ఇచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. దీంతో ప్రణతి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత జయంత్ అనే కంటెస్టెంట్ పాడిన ఖైదీ 150 (Khaidi 150) సినిమా పాటకి అతనితో కలిసి చిరు డ్యాన్స్ వేసి కూలింగ్ గ్లాసెస్ బహుకరించారు. 

ఇలా మెగాస్టార్ ఫుల్ జోష్ తో షోలో హడావిడి చేశారు. ఇక, జూనియర్ పూజా హెగ్డే (Pooja Hegde) గా పేరొందిన వాగ్దేవి తో కలిసి చిరు .. ‘ఉ అంటావా మావ ఉఊ అంటావా’ పాట పాడి అందరిలో మరింత జోష్ ను నింపారు. దీంతో ప్రోమో వైరల్ గా మారింది. అభిమానులు, ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి చిరంజీవితో పాటు రానా, సాయి పల్లవి కూడా వచ్చారు. రానా చిన్నప్పుడు చరణ్ తో జరిగిన ఫన్నీ సన్నివేశాల్ని షేర్ చేసుకున్నారు. జడ్జిగా వ్యవహరిస్తున్న నిత్యామీనన్ కూడా ఒక సాంగ్ పాడి అలరించింది. ఇలా ప్రోమో ఆద్యంతం అలరించింది.

Read More: Varshini sounderajan: ప‌ర‌వాల విందును పంచుతోన్న హాట్ యాంక‌ర్ వ‌ర్షిణి.. ఫొటోలు వైర‌ల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!