మా ఇద్దరి అభిరుచులు ఒకటే.. హీరోయిన్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన అల్లు శిరీష్ (Allu Sirish)

Updated on Oct 19, 2022 02:06 PM IST
నటీనటుల జీవితాల్లో గాసిప్స్ రావడం సహజమేనని అల్లు శిరీష్​ (Allu Sirish) అన్నారు
నటీనటుల జీవితాల్లో గాసిప్స్ రావడం సహజమేనని అల్లు శిరీష్​ (Allu Sirish) అన్నారు

గెలుపోటములతో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ పోతున్న హీరోగా అల్లు శిరీష్ (Allu Sirish)ను చెప్పొచ్చు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆయన ఎంటర్‌టైన్ చేస్తుంటారు. ఇప్పుడు ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీతో మరోమారు ఆడియెన్స్ మనసులను గెల్చుకోవడానికి ఈ యంగ్ హీరో సిద్ధమవుతున్నారు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో శిరీష్–అను జోడీ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తోంది. వీరి ఫొటోలు యువతను ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ఈ జంట ప్రేమలో ఉందని మాట్లాడుకుంటున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. దీనిపై తాజాగా అల్లు శిరీష్ స్పందించారు. అను తనకు మంచి ఫ్రెండ్ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. 

మేం మంచి ఫ్రెండ్స్ మాత్రమే..

‘నటీనటుల జీవితాల్లో ఇలాంటి గాసిప్స్ రావడం సహజం. కోస్టార్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం కామన్. నా గురించి గతంలోనూ ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కానీ నిజం చెప్పాలంటే మా మధ్య అలాంటిదేమీ లేదు. మేం మంచి స్నేహితులం. మా ఇద్దరి అభిరుచులు, వ్యక్తిత్వాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. తను నాలాగే చాలా సైలెంట్. సంగీతం, పుస్తకాలు, సినిమాలు.. ఇలా చాలా విషయాల్లో మా ఇష్టాలు, అభిరుచులు కలిశాయి. అందువల్ల షూటింగ్ సమయంలో మేం ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఆస్కారం కలిగింది. పని విషయంలో తను చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. అందువల్లే రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు మేం ఇబ్బందిపడలేదు’ అని అల్లు శిరీష్ స్పష్టం చేశారు. 

అల్లు శిరీష్–అనూ ఇమ్మాన్యుయేల్ జంట ప్రేమలో ఉన్నారని గాసిప్స్ వస్తున్నాయి

అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నా

రెండేళ్ల నుంచి తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని అల్లు శిరీష్ చెప్పారు. ఆన్‌లైన్‌లో కామెంట్లు చూసినప్పుడు నెగటివిటీని ఎక్కువగా ఫీలవుతామన్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారని అల్లు శిరీష్ పేర్కొన్నారు. 

ఇకపోతే, అల్లు శిరీష్ తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’కు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 4న ఆడియెన్స్ ముందుకు రానుంది. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతిరోజు పండగే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లాంటి హిట్ సినిమాలను నిర్మించిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ‘ఊర్వశివో రాక్షసివో’ రూపొందడం విశేషం. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘మాయారే’ పాట మంచి ఆదరణను పొందుతోంది. మరి, ఈ చిత్రమైనా అల్లు శిరీష్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందిస్తుందేమో చూడాలి. 

Read more: అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో సినిమా ప్లానింగ్ చేస్తున్న అగ్ర నిర్మాత ఎవరంటే..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!