Akhil Akkineni: అమెజాన్ ప్రైమ్ లో అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్!

Updated on May 26, 2022 03:00 PM IST
'ఏజెంట్' సినిమా పోస్ట‌ర్ (Agent Movie Poster)
'ఏజెంట్' సినిమా పోస్ట‌ర్ (Agent Movie Poster)

అక్కినేని నాగార్జున న‌ట‌వార‌సుడైన‌ అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కి  చాలా కాలం తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో కెరీర్‌లో తొలి హిట్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత‌ ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే స్పై థ్రిల్లర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. స్టైలిష్ డైరక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని అనిల్ సుంకర- ఎకె ఎంటర్ టైన్మెంట్స్ - సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ర‌చయిత‌ వక్కంతం వంశీ కథను అందించారు. సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్ సంగీతమందిస్తున్నాడు.    ఇక‌, ఇందులో ప్రత్యేక పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా.. హీరోయిన్ గా సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘ఏజెంట్’ (Agent) మూవీ అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం విడుద‌ల కాక‌ముందే ఓటిటి డీల్ లాక్ అయ్యింది. ఆ వివరాలు ప్ర‌స్తుతం ట్రేడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను  దక్కించుకున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఏ రేటుకు ఈ డీల్ లాక్ అయిందనే విష‌యం ప్రస్తుతానికైతే బయిటకు రాలేదు. 

ఇక‌, ఈ చిత్రంలో (Akhil Akkineni) అఖిల్, ఇంటర్ పోల్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఆ పాత్రకు తగ్గరీతిలో అదిరిపోయే మేకోవర్ తో రాబోతున్నాడు.  హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అయిన‌ ‘బోర్న్ ఐడెంటిటీ’ ఈ సినిమాకి ఆధారమని తెలుస్తోంది. ఆగస్టు 12న ఏజెంట్ మూవీ ప్రపంచవ్యాప్తగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే ఈ పాత్రకోసం అఖిల్ జిమ్ లో గంట తరబడి వర్కవుట్స్ చేసాడు. దాని ఫలితంగా అఖిల్ ఇప్పుడు కండల వీరుడయ్యాడు. ఈ సినిమాలో అఖిల్ (Akhil Akkineni) తొలిసారి సిక్స్‌ప్యాక్ బాడీతో మనకు కనిపించ‌బోతున్నాడు. ఇన్నాళ్లూ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేసిన అఖిల్ మొదటిసారి యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ఇక తాజాగా చిత్ర యూనిట్ వదిలిన టైటిల్ అండ్ పోస్టర్‌కి అభిమానులు.. ప్రేక్షకులు .. ఇండస్ట్రీ వర్గాల నుంచి విశేషమైన స్పందన ల‌భిస్తోంది.  మ‌రోవైపు అఖిల్ నటన ఈ సినిమాలో హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.  
 
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య చాలా రూమర్లు వచ్చాయి. సినిమా షూటింగ్ ఆగిపోయిందని కొంతమంది, నిర్మాతగా సురేందర్ రెడ్డి (Director Surender Reddy) తప్పుకున్నాడంతో ఆర్థిక సమస్యల్లో ఉందని మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. అయితే అలాంటివేం లేదని, ఆ పుకార్లు నిజం కాద‌ని నిర్మాత ఈమధ్య క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మనాలీలో జరుగుతోంది. అఖిల్‌కి ఎలాంటి సినిమా పడాలో ఖచ్చితంగా అలాంటి సినిమానే సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడని తాజాగా వదిలిన అఖిల్ ఏజెంట్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!