Akkineni Akhil: పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'తమ్ముడు' (Thammudu) టైటిల్‌తో అఖిల్ తదుపరి సినిమా..?

Updated on Jul 12, 2022 06:38 PM IST
'ఏజెంట్' (Agent) మూవీతో అఖిల్ అక్కినేని అభిమానులకు.. ఒక మంచి థ్రిల్లర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
'ఏజెంట్' (Agent) మూవీతో అఖిల్ అక్కినేని అభిమానులకు.. ఒక మంచి థ్రిల్లర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Akkineni Akhil: యంగ్ హీరో అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' సినిమాతో తన కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు. వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న ఈ హీరోకు ఈ సినిమా కాస్త విముక్తినిచ్చిందనే చెప్పవచ్చు. ప్ర‌స్తుతం అఖిల్ న‌టిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. 

అఖిల్ 'ఏజెంట్' (Agent Movie) చిత్రం కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయిన‌ట్లు గ‌తంలో విడుద‌లైన పోస్ట‌ర్‌ల‌ను చూస్తే తెలుస్తుంది. కండ‌లు తిరిగిన దేహంతో అఖిల్ ‘రా ఏజెంట్‌’గా ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ గతేడాది నుంచి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. 

దీంతో ముందు అనుకున్న రిలీజ్ డేట్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి. అందుకే ఈ సినిమాను ఆగష్టు 12న రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పినా కూడా, ఆ సూచనలు అయితే కనిపించడం లేదు. ఇక ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా,  మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

ఇదిలా ఉండగా.. ఈ సినిమా తర్వాత అఖిల్ మరో సినిమాను లైన్‌లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 'వకీల్ సాబ్' (Vakeel Saab Movie) దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ మరో చిత్రం చేయబోతున్నాడని, రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ డైరెక్టర్ అఖిల్‌తో ఒక రొమాంటిక్ లవ్ డ్రామా సినిమాను ప్లాన్ చేసినట్టు టాక్. 

ఇక తాజాగా ఈ సినిమాపై మరొక గాసిప్ బయటకు వచ్చింది. ఈ సినిమాను గురించి ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయక ముందే..  ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓ సినిమా టైటిల్‌ను పెడితే బాగుంటుందని అనుకున్నారట. ఇదే క్రమంలో 'తమ్ముడు' టైటిల్‌ను దాదాపు లాక్ చేసినట్టు టాక్.

బాక్సింగ్ ఛాంపియన్‌గా పవన్ నటించిన 'తమ్ముడు' అప్పట్లో పెద్ద హిట్టు. మంచి వినోదంతో పాటు అద్భుతమైన పాటలు, అన్నిటికంటే బెస్ట్ కామెడీ టైమింగ్‌ను ఈ సినిమాలో పవర్ స్టార్ అందించారు. తాను అనుకున్న కథ ప్రకారం అఖిల్ కు ఈ టైటిల్ సెట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నారట.

ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని టాక్. అఖిల్ తాజా చిత్రమైన 'ఏజెంట్' (Agent Movie) రిలీజ్ తరువాత, ఈ సినిమా పట్టాలెక్కనున్నట్టు సమాచారం. మరి పవన్ టైటిల్‌తో ఈ యంగ్ హీరో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.

Read More: Agent : ఏజెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కినేని అఖిల్ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!