Agent Teaser: ఏజెంట్ టీజర్ రిలీజ్!.. ద‌మ్ముంటే కాల్చండి అంటున్న హీరో అఖిల్ (Akhil Akkineni)

Updated on Jul 16, 2022 01:30 PM IST
Agent Teaser: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఏజెంట్ టీజర్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు
Agent Teaser: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఏజెంట్ టీజర్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు

టాలీవుడ్‌లో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) 'ఏజెంట్' సినిమాతో త‌న స‌త్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. 'ఏజెంట్' టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' త‌ర్వాత అఖిల్ న‌టిస్తున్న చిత్రం ఏజెంట్. 

అఖిల్ సాహ‌సాలు
'ఏజెంట్' చిత్రంలో అఖిల్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. అలాగే సీరియ‌స్ రోల్ ప్లే చేస్తున్నారు. ట్రైల‌ర్‌లో అఖిల్ సిక్స్ ప్యాక్‌లో అదిరిపోయారు. యాక్ష‌న్ సీన్ల‌లో అఖిల్ పెద్ద పెద్ద సాహ‌సాలే చేశారు.

మంచు కొండ‌ల్లో అఖిల్ ఎందుకు ర‌క్తం కారుతూ క‌నిపించారు?. 'ద‌మ్ముంటే కాల్చండి' అని ఎవ‌రిని అంటున్నాడు? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే, రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఇలా ఎన్నో థ్రిల్లింగ్ అంశాల‌ను ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి 'ఏజెంట్‌'లో తెర‌కెక్కించారు. ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్, థ్రిల్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాగా ఏజెంట్ ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. 

కీల‌క పాత్ర‌లో ముమ్ముట్టి 
మమ్ముట్టి 'ఏజెంట్' చిత్రంలో ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ‌హాదేవ్‌ పాత్రలో మమ్ముట్టి యాక్ష‌న్ సీన్లు సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్ కానున్నాయి. ఈ సినిమాను రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందించారు.

ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, సురేందర్ రెడ్డి (Surender reddy) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. 

పాన్ ఇండియా సినిమాగా ఏజెంట్
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) న‌టిస్తున్న 'ఏజెంట్' స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా సురేంద‌ర్ రెడ్డి రూపొందించారు. 'ఏజెంట్' చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. ఏజెంట్‌ చిత్రానికి అఖిల్ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌లో వాటా తీసుకుంటార‌ట‌. 

Read More: Faria Abdullah: మరో ఐటెం సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!