Vikrant Rona Movie: 'సుదీప్ మైండ్ సెట్ ఎంతో పవర్ఫుల్.. అక్కినేని అఖిల్ (Akhil) ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Jun 29, 2022 08:28 PM IST

కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona Movie). ఈ మూవీ 3డీ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాదాద్ లో వేడుకగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌, అఖిల్ అక్కినేని, విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, మంగ్లీ, అనూప్ భండారి, షాలిని త‌దిత‌రులు పాల్గొన్నారు. 

కాగా, ఈ చిత్రాన్ని అనూప్ భండారి దర్శకత్వం వహించారు. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉత్త‌రాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఇన్‌వెనియో ఆరిజ‌న్స్ బ్యాన‌ర్‌పై అలంకార్ పాండియ‌న్ ఈ సినిమాకు స‌హ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంఛ్ (Vikrant Rona Telugu Trailer) కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వ‌హించారు. 

ఈ ట్రైలర్ ఈవెంట్ కి స్పెషల్ గెస్టులు గా విచ్చేసిన వారిలో హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) మాట్లాడుతూ, టెక్నికల్ బ్రిలియన్స్, క్రియేటివ్ బ్రిలియన్స్ కలిసి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో విక్రాంత్ రోనా 3డి ట్రైలర్ ఆ విధంగా అద్భుతంగా ఉందని, ఇక హీరో సుదీప్ తనకు పదేళ్లకు పైగా సుపరిచితం అని, ఆయన లుక్స్ పరంగా, మాటల పరంగా మాత్రమే కాదు ముఖ్యంగా ఆయన మైండ్ సెట్ కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని ఆయన పై సూపర్ కామెంట్స్ చేశారు.

ఇక అఖిల్ తో పాటు ఈ ఈవెంట్ కి విచ్చేసిన వి విజయేంద్ర ప్రసాద్, రామ్ గోపాల్ వర్మ (Ramgoapl Varma) వంటి సినిమా ప్రముఖులు ట్రైలర్ అదిరిపోయిందని, తప్పకుండా మూవీ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More: Vikrant Rona 3D Trailer: ‘విక్రాంత్ రోణ’ 3D ట్రైలర్ సందర్భంగా హీరో సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!