ప్ర‌కృతి ప్రేమికుడిగా జ‌గ‌ప‌తిబాబు (Jagapathi Babu) సింబా ఫ‌స్ట్ లుక్ : చెట్టునే భుజాన మోస్తున్న హీరో  

Updated on Jun 06, 2022 02:06 PM IST
సింబా (Simbaa) అనే టైటిల్‌లో జ‌గ‌ప‌తి బాబు (Jagapathi Babu)  హీరోగా నటిస్తున్నారు.   సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.
సింబా (Simbaa) అనే టైటిల్‌లో జ‌గ‌ప‌తి బాబు (Jagapathi Babu) హీరోగా నటిస్తున్నారు.  సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.

సరికొత్త పాత్రలో జగపతిబాబు

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు (Jagapathi Babu) విభిన్నమైన పాత్రలతో మంచి కథానాయకునిగా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం విల‌న్ రోల్స్ చేస్తూ దక్షిణాదితో పాటు ఉత్తరాది చిత్రాలలో కూడా బిజీ అయ్యారు. ఇదే క్రమంలో జ‌గ‌ప‌తిబాబు హీరోగా ఓ కొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. సింబా (Simbaa) అనే టైటిల్‌ రోల్‌ను ఆయన పోషించనున్నారు.

ముర‌ళీ మోహ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా విడుద‌ల కానుంది. 'సింబా - ది ఫారెస్ట్ మ్యాన్' అనే ట్యాగ్ లైన్‌తో ఇటీవలే నిర్మాతలు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌‌గా 'సింబా' తెర‌కెక్కుతోంది. సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్  స‌మ‌ర్ప‌ణ‌లో.. దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది,

పర్యావరణాన్ని పరిరక్షించే పోరాటయోధుడిగా జగపతిబాబు

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణం దినోత్స‌వం (జూన్ 5) సంద‌ర్భంగా  సింబా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. రియ‌ల్ లైఫ్‌లో జ‌గ‌ప‌తిబాబు (Jagapathi Babu) ప్ర‌కృతి ప్రేమికుడు. రీల్ లైఫ్‌లోనూ ప్ర‌కృతిని కాపాడే సింబా పాత్రలో ఆయన న‌టించడం విశేషం. అడ‌వుల్లో నివ‌సించే మాచోమ్యాన్‌గా జ‌గ‌ప‌తిబాబు ఈ సినిమాలో తన అభిమానులను అలరించనున్నారు.

జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లే సన్నివేశాన్ని, మనం ఫస్ట్ లుక్‌లో చూడవచ్చు. ఈ చిత్రానికి డి.కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తుండగా.. కృష్ణప్రసాద్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Read more: ‘సింబా’ ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌.. ఫారెస్ట్‌ మ్యాన్‌గా ఆకట్టుకుంటున్న జగపతిబాబు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!