బాలీవుడ్‌లో త‌న‌ విల‌నిజం చూపిస్తానంటున్న‌ జ‌గ్గు భాయ్ (Jagapathi Babu)

Updated on May 27, 2022 06:39 PM IST
స‌ల్మాన్ ఖాన్ (Salman Khan)  కభీ ఈద్‌ కభీ దివాలీ సినిమాలో కీల‌క పాత్ర‌లో జ‌గ్గు భాయ్ (Jagapathi Babu) నటిస్తున్నారు
స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) కభీ ఈద్‌ కభీ దివాలీ సినిమాలో కీల‌క పాత్ర‌లో జ‌గ్గు భాయ్ (Jagapathi Babu) నటిస్తున్నారు

టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్ సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్న హీరో జ‌గ‌ప‌తి బాబు (Jagapathi Babu). హీరోగానే కాకుండా ఈ మ‌ధ్య విల‌న్ వేషాల‌తో వావ్ అనిపిస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనే విల‌నిజం చూపించ‌డానికి రెడీ అవుతున్నారు. అది కూడా స‌ల్మాన్ ఖాన్‌ను ఢీ కొట్ట‌బోతున్నారు. స‌ల్మాన్ ఖాన్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా కభీ ఈద్‌ కభీ దివాలీ (Kabhi Eid Kabhi Diwali) సినిమాలో న‌టిస్తున్నారు. ఆ సినిమాలో స‌ల్మాన్ ఖాన్‌కు ప్ర‌తినాయ‌కుడిగా న‌టించే అవ‌కాశం జ‌గ‌ప‌తిబాబుకు వ‌చ్చింది.

ద‌క్షిణాది సినిమాల్లో విల‌న్ క్యారెక్ట‌ర్ల‌లో జ‌గ‌ప‌తి బాబు అద్భుత‌మైన యాక్టింగ్ చేస్తున్నారు. ఒక్కో సినిమాలో ఒక్కో వెరైటీ గెట‌ప్‌ల‌తో సైలిష్‌గా క‌నిపిస్తున్నారు. స‌లార్ సినిమాలో భ‌యంక‌ర‌మైన ప్ర‌తీ నాయ‌కుడి పాత్ర‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మాస్, క్లాస్ విల‌నిజంతో ఇప్పుడు సౌత్ అవ‌కాశాల‌ను అందుకుంటున్నారు. స‌ల్మాన్‌తో జ‌గ్గు భాయ్ ఎలా ఢీ కొడ‌తారో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాలో వెంక‌టేష్ కూడా ఓ కీల‌క రోల్‌లో న‌టిస్తున్నారు. నిజానికి స‌ల్మాన్ ఖాన్‌తో న‌టించేందుకు జ‌గ‌ప‌తి బాబుకు అంత‌కు ముందే అవ‌కాశాలు వ‌చ్చాయ‌ట‌. కానీ స‌మ‌యం దొర‌క‌కో లేదా మ‌రేదైనా కార‌ణంతోనో జ‌గ‌ప‌తి బాబు న‌టించేందుకు అంగీక‌రించ‌లేదు. కానీ ఫ‌ర్హాద్ సామ్జీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ కభీ ఈద్‌ కభీ దివాలీ సినిమాలో కీల‌క పాత్ర‌లో జ‌గ్గు భాయ్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హైద‌రాబాద్‌లో మే 12 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. డిసెంబ‌ర్ 30న స‌ల్మాన్ ఖాన్ కభీ ఈద్‌ కభీ దివాలీ సినిమా రిలీజ్ కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!