‘సింబా’ ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌.. ఫారెస్ట్‌ మ్యాన్‌గా ఆకట్టుకుంటున్న జగపతిబాబు (Jagapathi Babu)

Updated on Jun 05, 2022 11:03 PM IST
జగపతిబాబు (Jagapathi Babu)
జగపతిబాబు (Jagapathi Babu)

రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు  సంప‌త్ నంది. తాజాగా సంపత్‌ నంది రూపొందిస్తున్న సినిమా ‘సింబా’. సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. అడవి నేపథ్యంలో జరిగే కథతో సింబా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘సింబా’ కథను సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్‌తో రచించాడు సంపత్‌నంది. ‘ది  ఫారెస్ట్ మ్యాన్’ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ముర‌ళీ మోహ‌న్ రెడ్డి ద‌ర్శక‌త్వం వహిస్తున్న సింబా సినిమాను సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ స‌మ‌ర్పణ‌లో రాజ్ దాస‌రి ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై సంప‌త్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింబా మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్‌ లుక్‌లో చెట్టును మోస్తూ పర్యావరణ ప్రేమికుడిగా కనిపించాడు జగపతిబాబు. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రకృతి బిడ్డగా మరో అద్భుతమైన క్యారెక్టర్‌‌లో జగపతిబాబును చూపించనున్నాడు దర్శకుడు. 'ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబుని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. వరల్డ్ ఎన్విరాన్‌మెంట్‌ డే సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్‌ సింబాను పరిచయం చేస్తున్నాం' అని మేకర్స్ రాసిన వాక్యాలు ఆకట్టుకుంటున్నాయి.  

సింబా మూవీ పోస్టర్‌‌లో జగపతిబాబు (Jagapathi Babu)

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోగా, ప్రస్తుతం టాప్ విల‌న్‌గా కొనసాగుతున్న జ‌గ‌ప‌తిబాబుకు అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్‌ సినిమాలతోపాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సినిమాలో విల‌న్‌గా న‌టించే ఆఫ‌ర్ వ‌చ్చింది జగ్గూ భాయ్‌కి. అది కూడా బాలీవుడ్ స్టార్‌‌ హీరో స‌ల్మాన్‌ఖాన్‌ పక్కన విలన్‌గా నటించడానికి. సినిమాలో జగ్గూభాయ్‌ది పవర్‌‌ఫుల్ క్యారెక్టర్ అని తెలుస్తోంది.  నాజిద్ న‌డియాడ్ వాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ పూజా హెగ్డే నటిస్తోంది. ఇక, తెలుగులో కూడా పలు సినిమాల్లో నటిస్తున్న జగపతిబాబు (Jagapathi Babu)కు సంపత్‌నంది ఇచ్చిన క్యారెక్టర్‌‌ ఇంకెంత మంచి పేరు తెస్తుందో చూడాలి మరి.

Read More: బాలీవుడ్‌లోనూ తన విలనిజం చూపిస్తానంటోన్న జగపతిబాబు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!