సూపర్‌‌స్టార్ కృష్ణ (Ghattamaneni Krishna) వ్యక్తిగత జీవితం గురించిన 10 ఆసక్తికర విశేషాలు

Updated on Nov 15, 2022 10:21 AM IST
కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది
కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

ప్రేక్షకుల హృదయ ‘సింహాసనం’లో తిష్ట వేసుకుని కూర్చున్న ‘మకుటం లేని మహారాజు’, టాలీవుడ్‌ ‘జేమ్స్‌బాండ్’, సినీ కళామతల్లి ‘ముద్దుబిడ్డ’, రాజకీయ చదరంగం’లో ‘అజాతశత్రువు’, నిర్మాతలకు ‘ధనవంతుడు గుణవంతుడు’, మనస్సాక్షి మాట వినే ‘అల్లరి బుల్లోడు’.. అన్నింటికీ మించి అభిమానుల గుండెల్లో ‘బుర్రిపాలెం బుల్లోడు’.. ఆయనే మన సూపర్‌‌స్టార్‌‌, నటశేఖర కృష్ణ.

సూపర్‌‌స్టార్ కృష్ణ (Superstar Krishna)కు సంబంధించిన టాప్‌10 విశేషాలు ప్రత్యేకంగా పింక్‌విల్లా ఫాలోవర్స్‌ కోసం..

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

ఇంటికి పెద్ద కొడుకు..

గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో 1942, మే 31వ తేదీన జన్మించారు కృష్ణ. ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల నలుగురి సంతానంలో మొదటివారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. ఏలూరులోని సీఆర్‌‌ఆర్‌‌ కాలేజీలో బీఎస్సీలో డిగ్రీ పూర్తి చేశారు.

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

అభిమానుల కోలాహలం చూసి..

నందమూరి తారక రామారావు అంటే కృష్ణకు విపరీతమైన అభిమానం. కృష్ణ డిగ్రీ చదువుతున్న సమయంలో సీఆర్‌‌ఆర్‌‌ కాలేజీలో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన అభిమానులను చూసి సినిమా నటుడు కావాలని నిర్ణయించుకున్నారు కృష్ణ.

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

హీరోకాక ముందే పెళ్లి..

కృష్ణ హీరోగా నటించిన మొదటి సినిమా ‘తేనె మనసులు’. ఈ సినిమా ప్రారంభయ్యే సమయానికే ఇందిరాదేవితో ఆయనకు వివాహం జరిగింది. కృష్ణకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. పెద్ద కొడుకు రమేష్‌బాబు, రెండో కొడుకు మహేష్‌బాబు. కృష్ణ నటవారసులుగా రమేష్‌బాబు, మహేష్‌బాబు కూడా సినీ పరిశ్రమలోకి వచ్చారు.

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

ఇందిరా దేవి అంగీకారంతో..

ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత హీరోయిన్, దర్శకురాలు అయిన విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కృష్ణ. విజయనిర్మలకు కూడా అప్పటికే పెళ్లి జరిగింది. కాగా, కృష్ణ రెండో పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్య ఇందిరా దేవి అంగీకారం తీసుకున్నారని టాక్.

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

నిద్రిస్తున్నా షూటింగ్‌..

90వ దశకం వరకూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు కృష్ణ. కొన్ని సంవత్సరాలు మూడు షిప్ట్‌లు షూటింగ్‌కు హాజరయ్యేవారు. రాత్రి పడుకునే సమయంలో కూడా సినిమా కాస్ట్యూమ్స్‌ వేసుకునే పడుకునేవారు. ఆ సమయంలో ఆయన నిద్రిస్తున్న సన్నివేశాలను దర్శకులు చిత్రీకరించుకునేవారట. ఈ బిజీ కారణంగా కుటుంబ సభ్యులతోనూ, పిల్లలతో సమయాన్ని గడపలేకపోయారని అంటారు.

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

తండ్రి సహకారం..

డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్‌లో చేరాలని అనుకున్నారు కృష్ణ. అయితే సీటు రాలేదు. దాంతో సినిమా రంగంలోకి వెళ్లాలని చాలాకాలంగా అనుకుంటున్న విషయాన్ని తండ్రికి చెప్పారు. తనకు తెలిసిన సినిమా వాళ్లకు ఉత్తరం రాసి ఇచ్చి మద్రాసు పంపించారు కృష్ణ తండ్రి. అప్పటికి సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉండేది.

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

చిన్న వయసు కావడంతో..

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వారైన కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటివారు అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నారు. కృష్ణ.. వాళ్లను కలిసి సినిమాల్లో నటించాలని అనుకుంటున్న తన ఉద్దేశాన్ని తెలిపారు. వయసు రీత్యా చిన్న వాడివని, కొన్నాళ్ల తర్వాత మళ్లీ మద్రాసు రావాలని సలహా ఇచ్చి పంపించేశారు.

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

శోభన్‌బాబుతో కలిసి..

మద్రాసు నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత నాటకాలు వేసి నటనలో అనుభవం తెచ్చుకున్నారు కృష్ణ. శోభన్‌బాబుతో కలిసి ఒక నాటకం వేశారు. విజయవాడలో ప్రజానాట్య మండలి ప్రదర్శించిన ‘చైర్మన్‌’ నాటకంలో కీలకపాత్ర చేశారు. అనంతరం మరోసారి మద్రాసు వచ్చి సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నించారు కృష్ణ.

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

ప్రతిరోజూ సెకండ్‌ షో..

ఎల్వీ ప్రసాద్‌ తెరకెక్కిస్తున్న కొడుకులు కోడళ్లు సినిమాలో చిన్న పాత్రకు కృష్ణ ఎంపికయ్యారు. అయితే పలు కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కూడా ఎప్పుడూ డబ్బుల కోసం కృష్ణ ఇబ్బంది పడలేదు. డబ్బులు కావాలని ఇంటికి ఉత్తరం రాస్తే.. కృష్ణ తల్లి నాగరత్న డబ్బులు పంపించేవారు. ప్రతిరోజూ సెకండ్ షో సినిమా చూడటం, పగలంతా సినిమాల్లో అవకాశాల కోసం తెలిసిన వాళ్లను కలిసి ప్రయత్నిస్తూ ఉండేవారు.

కొన్ని సంవత్సరాల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులలో కూడా పనిచేసేవారు కృష్ణ. తేనె మనసులు సినిమా ప్రారంభం కాకముందే కృష్ణకు వివాహం జరిగింది

తమిళం రాకపోవడంతో..

1962వ సంవత్సరంలో కొంగర జగ్గయ్య నిర్మించిన ‘పదండి ముందుకు’ సినిమాలో చిన్న పాత్ర పోషించారు కృష్ణ. ఆ తర్వాత కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ సినిమాల్లో కూడా నటించారు. కాదలిక్క నేరమిల్లై అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చినా.. కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం చేజారిపోయింది. దాంతో మద్రాసు నుంచి తిరిగి వెళ్లిపోయారు కృష్ణ.

Read More : Superstar Krishna: అత్యంత విషమంగా సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!