Superstar Krishna: అత్యంత విషమంగా సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు

Updated on Nov 14, 2022 03:57 PM IST
కృష్ణ (Superstar Krishna) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయమంగా ఉందని.. ఇప్పుడే ఏమీ చెప్పలేమని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు 
కృష్ణ (Superstar Krishna) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయమంగా ఉందని.. ఇప్పుడే ఏమీ చెప్పలేమని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు 

సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) ఆరోగ్యం విషమంగా ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ చైర్మన్ గురునాథ్ రెడ్డి మీడియాలో మాట్లాడారు. సుమారు మధ్యరాత్రి సమయంలో కృష్ణ గుండెపోటుకు గురయ్యారని గురునాథ్ రెడ్డి అన్నారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పారు. దీంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించామని గురునాథ్ రెడ్డి (Dr. Gurunath Reddy) పేర్కొన్నారు. 

కృష్ణ గారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. అరగంట పాటు సీపీఆర్ చేశాం. ప్రస్తుతం ఆయనకు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నవారికి ఎటువంటి చికిత్స అందించాలో అదే చేస్తున్నాం. ఇప్పటికీ ట్రీట్‌మెంట్ కొనసాగుతూనే ఉంది. మరో ఇరవై నాలుగు గంటల వరకు ఏదీ చెప్పలేం’ అని గురునాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. కృష్ణ దగ్గరి బంధువులందరూ ఆస్పత్రిలో ఉన్నారని.. వారి ప్రైవసీని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ప్రతి గంట కీలకమని.. ఆయన కోలుకోవాలని ప్రార్థిద్దామని గురునాథ్ రెడ్డి అన్నారు. 

ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పారు

ఇకపోతే, సూపర్‌స్టార్ కృష్ణ గత కొన్నాళ్లుగా శ్వాస కోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రెగ్యులర్ చెకప్ కోసం కాంటినెంటల్ హాస్పిటల్‌ (Continental Hospitals)కు వెళ్లిన ఆయన అక్కడే జాయిన్ అయ్యారు. కాగా, కృష్ణ భార్య ఇందిరా దేవి ఈమధ్యే మృతి చెందారు. ఆయన కుమారుడు రమేష్ బాబు కొన్ని నెలల కింద కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ఘట్టమనేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌స్టార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 

Read more: ఏదీ శాశ్వతం కాదు.. మనిషి తత్వమే మానవత్వం : సూపర్‌‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) చెప్పిన జీవిత సత్యాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!