సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna)కు తీవ్ర అస్వస్థత.. చికిత్స అందిస్తున్న డాక్టర్లు 

Updated on Nov 14, 2022 12:12 PM IST
సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

సూపర్‌స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి (Continental Hospital)లో చికిత్స పొందుతున్నారు. శ్వాస కోస సంబంధిత వ్యాధితో కృష్ణ బాధపడుతున్నారు. రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన అక్కడే జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. 

కృష్ణ భార్య ఇందిరా దేవి ఈమధ్యే మృతి చెందారు. ఆయన కుమారుడు రమేష్ బాబు కొన్ని నెలల కింద కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ఘట్టమనేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌స్టార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 

కృష్ణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ఘట్టమనేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి సినీ నటుడు నరేశ్ స్పందించారు. కృష్ణ హెల్త్ సిచ్యువేషన్ బాగానే ఉందని నరేశ్‌ తెలిపారు. ఇరవై నాలుగు గంటల తర్వాత ఆస్పత్రి నుంచి ఆయన్ను డిశ్చార్జ్‌ చేస్తారని చెప్పారు. కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని.. జనరల్‌ చెకప్‌ కోసమే ఆస్పత్రికి వెళ్లారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

Read more: ఏదీ శాశ్వతం కాదు.. మనిషి తత్వమే మానవత్వం : సూపర్‌‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) చెప్పిన జీవిత సత్యాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!