ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న ‘సార్’ సినిమా నుంచి రెండు అప్‌డేట్స్‌.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌

Updated on Jul 25, 2022 08:10 PM IST
తెలుగులో డైరెక్ట్‌గా సినిమా చేస్తున్న ధనుష్‌ (Dhanush).. ‘సార్‌‌’ సినిమా పోస్టర్
తెలుగులో డైరెక్ట్‌గా సినిమా చేస్తున్న ధనుష్‌ (Dhanush).. ‘సార్‌‌’ సినిమా పోస్టర్

త‌మిళ హీరో ధ‌నుష్ (Dhanush) డైరెక్ట్‌గా తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ‘సార్‌‌’. ధనుష్‌ నటించిన సినిమాలు కొన్ని తెలుగులోకి డబ్బింగ్‌ చేసి రిలీజ్ చేశారు మేకర్స్. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి కూడా. రఘువరన్ బీటెక్, వీఐపీ2, మారి సినిమాలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ విధంగా ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.

ప్రస్తుతం ధ‌నుష్ ఐదు సినిమాలను లైన్లో పెట్టారు. అందులో ‘స‌ర్’ సినిమా ఒక‌టి. ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్‌ దే’ ఫేం వెంకీ అట్లూరి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుంచి రెండు బిగ్ అప్‌డేట్‌ల‌ను ప్రక‌టించారు మేక‌ర్స్.

ధనుష్‌ (Dhanush).. నటించిన ది  గ్రే మ్యాన్ సినిమా  పోస్టర్

ఒక రోజు తేడాలోనే..

సార్ సినిమాలో ధ‌నుష్ (Dhanush) ఫ‌స్ట్‌ లుక్‌ను జూలై 27న, టీజ‌ర్‌ను జూలై 28న విడుద‌ల చేయ‌నున్నట్లు సోష‌ల్ మీడియాలో పోస్టర్‌ విడుద‌ల చేశారు. రెండు అప్‌డేట్‌లను ఒక రోజు తేడాలోనే విడుదల చేస్తుండడంతో ధ‌నుష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. యాక్షన్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సార్ సినిమాలో ధ‌నుష్‌ సరసన సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

 జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ధ‌నుష్ న‌టించిన ‘తిరుచిత్రంబ‌లం’, ‘నానే వ‌రువ‌న్’ విడుద‌ల‌కు రెడీగా ఉన్నాయి. ధనుష్‌ (Dhanush) హాలీవుడ్‌లో నటించిన ‘ది గ్రే మ్యాన్’ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read More : ట్విటర్‌‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ఆది సాయికుమార్ (Aadi Sai Kumar).. వీడియో షేర్ చేసిన యంగ్ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!