Vadde Naveen: బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్.. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ ?

Updated on Jul 02, 2022 06:56 PM IST
 'బిగ్ బాస్ సీజన్ 6 ' లో పాల్గొనేది వీరేనంటూ, కొన్ని పేర్లు వైరల్‌ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి  వడ్డే నవీన్‌ ( Vadde Naveen) వచ్చి చేరారు.
'బిగ్ బాస్ సీజన్ 6 ' లో పాల్గొనేది వీరేనంటూ, కొన్ని పేర్లు వైరల్‌ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి  వడ్డే నవీన్‌ ( Vadde Naveen) వచ్చి చేరారు.

బుల్లితెరపై ప్రసారమయ్యే షోలన్నింటిలో ప్రత్యేకం అనిపించుకుంది బిగ్ బాస్ (Telugu Biggboss). తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్స్‌ పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో... సీజన్‌ సీజన్‌కి రికార్డు క్రియేట్‌ చేసింది. అయితే ఇదే ఉత్సాహంతో ఓటీటీలోకి తీసుకొచ్చిన ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ఆ షో నడవలేదు. దీంతో త్వరలోనే ఆరో సీజన్‌ని ప్రారంభించి,  ఆ లోటుని తీర్చుకోవాలని భావిస్తున్నారు బిగ్‌ నిర్వాహకులు. 

సెప్టెంబర్ నుంచి మొదలవబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) కోసం ఇప్పటినుంచే హంగామా మొదలు పెట్టారు. ఇక ఎప్పటిలానే సీజన్ మొదలవడానికి ముందే సీజన్ లో వచ్చే సెలబ్రిటీస్ గురించి అంతటా డిస్కషన్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6లో కూడా ఏయే సెలబ్రిటీస్ వస్తున్నారు అన్నది ఆడియెన్స్ లో ఉత్సాహం మొదలైంది.

బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పటినుంచి అంటే..

ఇదిలా ఉంటే.. ఇక సీజన్ 6 ఎప్పటి నుంచి ప్రసారం చేయబోతున్నారన్న దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. 2022 సెప్టెంబర్ 4, 2022 ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో పాటు.. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ఇంకా పూర్తి కాకపోవడంతో ఈసారి కూడా ఆలస్యం తప్పేట్టు కనిపించడం లేదు.

ఒకవేళ ఇంకాస్త ముందే స్టార్ట్ చేయాలని అనుకుంటే మాత్రం.. జూలై 31 ఆదివారం నాడు స్టార్ట్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 1, 2లు జూన్, జూలై నెలల్లోనే ప్రారంభం అయ్యాయి కాబట్టి.. ఈ రెండు తేదీలలో ఏదో ఒక డేట్‌కి ఫిక్స్ కావచ్చు. 

అయితే.. షో ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే కంటెస్టెంట్స్‌ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. సీజన్‌ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా  హీరో వడ్డే నవీన్‌ (Hero Vadde Naveen) వచ్చి చేరాడు. ఒకప్పుడు స్టార్‌ హీరో అయిన వడ్డే నవీన్‌.. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సినిమాల్లోనే కాకుండా  ఏ ఈవెంట్‌లో కూడా నవీన్‌ కనిపించడం లేదు. అసలు ప్రస్తుతం వడ్డే నవీన్‌ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు. చివరిగా 2016లో వచ్చిన ఎటాక్ సినిమాలో కనిపించారు. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉన్నారు.

వడ్డే నవీన్ సినిమాలు

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్.. అప్పట్లో వరుస చిత్రాలతో సక్సెఫుల్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నారు. 1997-2016 మధ్య కాలంలో వడ్డే నవీన్ పేరు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపించింది. ‘పెళ్లి’ (Pelli Movie) సినిమా నవీన్ కెరియర్ మైల్ స్టోన్ మూవీ కాగా.. ‘కోరుకున్న ప్రియుడు’, ‘మనసిచ్చి చూడు’, ‘స్నేహితులు’, ‘నా హృదయంలో నిదురించే చెలీ’ ‘ప్రేమించే మనసు’, ‘బాగున్నారా’ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చాడు. 

వడ్డే నవీన్.. మినిమమ్ గ్యారంటీ హీరో

దాదాపు 28 సినిమాల్లో నటించిన వడ్డే నవీన్.. సక్సెస్ రేటు ఎక్కువే.. నిర్మాతగా కూడా మూడు నాలుగు సినిమాలను నిర్మించారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు సంపాదించిన వడ్డే నవీన్‌ని వరుస ఫ్లాప్‌లు వెంటాడాయి. అయితే, నవీన్‌కి మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంది. అందుకే బిగ్‌బాస్‌ నిర్వాహకులు వడ్డే నవీన్‌ని సీజన్‌ 6లోకి ఆహ్వానించారట.

భారీ రెమ్యునరేషన్ ఆఫర్

ఈ షోలో పాల్గొనడానికి మొదట్లో ఆయన ఒప్పుకోలేదట. దీంతో భారీ రెమ్యునరేషన్‌ని (Huge Remuneration) ఆఫర్‌ చేసి ఆయనను ఒప్పించారట. ఒకవేళ ఇదే నిజమైతే సీజన్‌ సిక్స్‌కి వడ్డే నవీనే స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతాడు. నవీన్‌తో పాటు సీజన్‌ సిక్స్ లిస్ట్‌లో  జబర్దస్త్ కమెడియన్స్ ఆది, దీప్తి పిల్లి, వర్షిణి, యాంకర్ ధనుష్, ఓటీటీ  కంటెస్టెంట్ లు శివ, అనిల్, మిత్రాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

Read More: Biggboss Season6: త్వరలో బిగ్ బాస్ సీజన్ 6.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!