Big Boss 6: బిగ్‌బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్!.. బాలాదిత్య (Baladitya), మెరినా (Marina) అవుట్?

Updated on Nov 12, 2022 04:38 PM IST
బిగ్‌బాస్ (Big Boss Season 6) హౌస్ నుంచి ఈ వారం బాలాదిత్య (Baladitya), మెరినా (Marina) ఎలిమినేట్ అయ్యారని సమాచారం
బిగ్‌బాస్ (Big Boss Season 6) హౌస్ నుంచి ఈ వారం బాలాదిత్య (Baladitya), మెరినా (Marina) ఎలిమినేట్ అయ్యారని సమాచారం

బిగ్‌బాస్ (Big Boss Season 6) ఆరో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్న గలాటా గీతు గత వారం ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ వారం ఎవరు గేమ్ నుంచి వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి బిగ్‌బాస్ ఇంట్లో పదోవారం ఎలిమినేషన్స్‌లో అందరికీ షాకుల మీద షాకులు వచ్చేట్లు కనిపిస్తోంది. బాలాదిత్యతోపాటు మెరినా ఎలిమినేట్ అయినట్లు లీకులు వైరల్ అవుతున్నాయి. 

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం బయటకు వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు లీకులు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఈ వారం బిగ్‌బాస్ ఇంట్లో నుంచి ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు మరెవరో కాదు.. బాలాదిత్య (Baladitya), మెరినా (Marina) అనే టాక్ బాగా వినిపిస్తోంది. బాలాదిత్య, మెరినా ఎలిమినేట్ అయ్యారంటూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు కనిపిస్తున్నాయి. దీంతో అందరూ బాలాదిత్య ఎలిమినేషన్ విషయంలో షాక్ అవుతున్నారు.

మెరినా ఎలిమినేషన్ అనుకున్నట్లే..!

ఇక, మెరినా ఎందుకు ఎలిమినేట్ అయ్యిందనే విషయంలో ఎవ్వరికీ ఏ అనుమానం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. రోహిత్, మెరినాల్లోంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలని ఆడియెన్స్ అనుకుంటూనే ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు మెరినాను బయటకు పంపించేశారని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

బాలాదిత్యను ఎందుకు ఎలిమినేట్ చేశారు?

బాలాదిత్య లాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేసేంతగా హౌస్‌లో ఏం జరిగి ఉంటుందని అంతా ఆలోచిస్తున్నారు. బాలాదిత్య ఎలిమినేషన్‌కు గల కారణాలు మాత్రం అంతగా తెలియరావడం లేదు. హౌస్‌మేట్స్‌తో మంచిగా ఉంటూ ఎవ్వరినీ మోసం చేయకుండా ఆడటం, ప్రేమగా మాట్లాడటం, గొప్పలు చెప్పుకోకపోవడం, ఎదుటి వాళ్లను కించపరుస్తూ పిచ్చి వేషాలు వేస్తూ కంటెంట్ ఇవ్వకపోవడం, టీఆర్పీ మెటీరియల్ కాకపోవడంతోనే బాలాదిత్యను ఎలిమినేట్ చేసి ఉంటారని సోషల్ మీడియాలో బాలాదిత్య అభిమానులు అనుకుంటున్నారు.

బిగ్‌బాస్ ఎలిమినేషన్స్ అనేది ఆడియెన్స్ చేతిలో ఉంటుందని అంతా అంటుంటారు. కానీ ఒక్కోసారి ఆ నిర్ణయాన్ని బిగ్‌బాస్ టీం కూడా తీసుకుంటుందని వినికిడి. అలా అయితే టీఆర్పీ కంటెంట్ ఇచ్చే గీతూను కూడా ఎలిమినేట్ చేయకూడదు. కానీ గత వారం గీతు ఎలిమినేషన్, ఈ వారం బాలాదిత్య ఎలిమినేషన్ రెండూ షాకింగ్‌గానే అనిపిస్తున్నాయి. మరి బిగ్‌బాస్ అంటే మామూలుగా ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఏదేమైనా గీతు (Galata Gitu), బాలాదిత్య ఫ్యాన్స్ మాత్రం నిరాశలో కూరుకుపోయారు. 

Read more: ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్!.. భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!