Biggboss Season 6: ‘టికెట్ 2 ఫినాలే’ గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టిన ఆదిరెడ్డి (AdiReddy).. కానీ ట్విస్ట్ ఏంటంటే

Updated on Dec 01, 2022 11:47 AM IST
ఆదిరెడ్డి (Adireddy) 'టికెట్ టు ఫినాలే' (Ticket To Finale) టాస్క్ గెలిచినా.. ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ కావాలి.
ఆదిరెడ్డి (Adireddy) 'టికెట్ టు ఫినాలే' (Ticket To Finale) టాస్క్ గెలిచినా.. ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ కావాలి.

Biggboss Season 6: బిగ్ బాస్ సీజన్ 6 దాదాపుగా ఆఖరి దశకు చేరుకుంది. హౌస్ లో ఈ వారం మొత్తం ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్‌ అయితే కంప్లీట్ అయ్యింది. టికెట్‌ టూ ఫినాలో సొంతం చేసుకుంటే వారు నేరుగా ఫైనల్‌ వీక్‌ వెళ్లిపోయినట్లే అంటే టాప్‌ 5 పక్కా అనమాట. దీంతో హౌస్‌లో ఇంటి సభ్యుల మధ్య చాలానే టాస్కులు నిర్వహించారు.

ఊహించని మలుపుల మధ్య ఈ టాస్కు చాలా ఆసక్తికరంగా.. జనరంజకంగా సాగింది. ఈ టాస్కులో ముందుగా శ్రీ సత్య (Sree satya), ఇనయా (Inaya Sultana) తొలగిపోయారు. అయితే.. తొలి రౌండ్ లో ఓడిపోయిన కీర్తి, ఇనయా, శ్రీ సత్య కి గేమ్ లో మళ్ళీ తిరిగొచ్చే అద్భుతమైన అవకాశం ని బిగ్ బాస్ ఇవ్వగా ఆ టాస్కులో శ్రీ సత్య, ఇనయా ఓడిపోవడంతో కీర్తి మళ్ళీ తిరిగి గేమ్ లోకి వస్తుంది.

ఇక తదుపరి టాస్కులో కేవలం నలుగురికి మాత్రమే కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం ఇచ్చాడు. మొత్తం మీద ఆరు మంది కంటెస్టెంట్స్ ఈ టాస్కులో ఉండగా.. ఏకాభిప్రాయంతో ఇద్దరినీ తొలగించాలని బిగ్ బాస్ (Telugu Biggboss) అంటాడు. కానీ కంటెస్టెంట్స్ అందుకు ఒప్పుకోకపోవడంతో శ్రీ సత్య, ఇనాయాకి ఇద్దరిని గేమ్ నుండి తొలగించే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్.

దీంతో.. శ్రీ సత్య, ఇనయా ఇద్దరూ కీర్తి (Keerthi Bhatt), రోహిత్ ని తొలగించగా రేవంత్, శ్రీహాన్, ఫైమా, ఆది రెడ్డి గేమ్ లో పాల్గొంటారు. ఈ టాస్కులో ఒక్కచేతితో స్టిక్ పట్టుకొని దానిపై న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న శ్రీ సత్య, ఇనయా చెప్పిన ఐటమ్స్ ని బ్యాలన్స్ చేస్తూ నిలబెట్టాలి. ఈ టాస్కులో ముందుగా ఫైమా తొలగిపోతుంది. ఆ తర్వాత రేవంత్ కూడా తొలగిపోతాడు. ఇక చివరికి ఆది రెడ్డి, శ్రీహాన్ మిగులుతారు. శ్రీహాన్ బ్యాలన్స్ చెయ్యడానికి చాలా వరుకు ప్రయత్నిస్తాడు. కానీ చివరి నిమిషం లో ఐటమ్స్ అన్నీ బ్యాలన్స్ తప్పిపోయి పడిపోతాయి.

ఇక, చివరిగా ఆదిరెడ్డి (Adireddy) ఈ టాస్కులో గెలుపొందుతాడు. మొదటి స్థానంలో ఆదిరెడ్డి నిలబడగా, రెండవ స్థానం లో రేవంత్, మూడవ స్థానం లో శ్రీహాన్, నాల్గవ స్థానంలో ఫైమా, ఐదవ స్థానంలో కీర్తి, ఆరవ స్థానంలో రోహిత్ నిలుస్తారు.

అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆదిరెడ్డి 'టికెట్ టు ఫినాలే' (Ticket To Finale) టాస్క్ గెలిచినా.. ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ కావాలి. అప్పుడే అతను టికెట్ టు ఫినాలే ద్వారా ఫైనల్‌ లోకి అడుగుపెడతాడు. అయితే ఆదిరెడ్డి వీకెండ్ ఎపిసోడ్ లో సేవ్ కావడం ఖాయంగా కనిపిస్తుండటంతో.. ఆయన టాప్ 5 కంటెస్టెంట్‌ అనడంతో ఎలాంటి సందేహం లేదు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్నందుకు గానూ.. ఆదిరెడ్డి వచ్చే వారం నామినేషన్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. దీంతో ఆదిరెడ్డి కాకుండా మిగిలిన వాళ్లు నేరుగా నామినేషన్స్‌లో వెళ్తారు.

Read More: Biggboss Season 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో చివరి కెప్టెన్ ఇనయా సుల్తానా (Inaya Sultana)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!