Biggboss Season 6: వెక్కి వెక్కి ఏడ్చేసిన గీతూ రాయల్ (Geetu Royal).. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ చూసి ఎమోషనల్!

Updated on Nov 24, 2022 11:25 AM IST
గీతూ ఎలిమినేట్ (Geetu Elimination) అని నాగార్జున అనౌన్స్ చేసినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయింది. నేను వెళ్లనూ అంటూ గుక్కపట్టి ఏడ్చింది.
గీతూ ఎలిమినేట్ (Geetu Elimination) అని నాగార్జున అనౌన్స్ చేసినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయింది. నేను వెళ్లనూ అంటూ గుక్కపట్టి ఏడ్చింది.

Biggboss Season 6: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ (Geetu Royal) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గీతూ రాయల్ తన యాసతో మంచి గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. అదే సమయంలో బిగ్‌బాస్ గేమ్ గురించి అతిగా ఆలోచించేది గీతూ రాయల్. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా 9వారాలే ఇంట్లో ఉండి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. 

ఇక గీతూ ఎలిమినేట్ (Geetu Elimination) అని నాగార్జున అనౌన్స్ చేసినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయింది. నేను వెళ్లనూ అంటూ గుక్కపట్టి ఏడ్చింది. హౌస్ లోనే ఉంటాను నన్ను పంపకండి అంటూ ఎంతో ప్రాధేయపడింది. అయినా గీతూని బయటకు పంపారు. ఇక బయకు వచ్చిన తర్వాత పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.

కానీ, సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు గీతూ సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె బిగ్ బాస్‌లోకి రీ-ఎంట్రీ (Geetu Re Entry) ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై గీతు స్పందించింది. తాను ఇక బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. "రీఎంట్రీ ఇచ్చాక ఇలాగే మధ్యలో వెళ్లాల్సి వస్తే ఆ బాధ ఇంకా నేను తట్టుకోలేను కాబట్టి మళ్ళీ వెళ్ళను" అని చెప్పింది.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు పాజిటివిటీతో వెళ్ళిన గీతూ బయటకు వచ్చేటప్పుడు బోలెడంత నెగిటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చింది. అయితే, బిగ్ బాస్ అంటే పడి చచ్చే గీతూ ఇలా ఊహించిన విధంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేయడం అన్నది ఆమెకు ఇప్పటికీ షాకింగ్ గానే ఉంది. టాప్ ఫైవ్ లో ఉంటుంది అనుకున్న గీతూ టాప్ 10లో కూడా లేకుండా ఎలిమినేట్ అయింది. ఇక, ఇప్పటికీ గీతూ ఎలిమినేట్ అయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది.

తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా.. తరచూ ఏడుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఏడ్చింది గీతూ (Geetu Royal). ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోన్న వేళ.. హౌస్ మేట్స్ అంతా తమ కుటుంబ సభ్యులను చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన గీతూ.. కన్నీరుమున్నీరైంది. ఈ వీడియోను గీతూ భర్త వికాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. 

‘గీతూ ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం చాలా కలలు కంది. షోలోకి వెళ్లకముందే వాళ్ల అమ్మకి చీర కొనిచ్చి దాన్ని కట్టుకురమ్మని చెప్పింది. సడన్ ఎలిమినేషన్ మేమంతా కూడా ఎక్స్ పెక్ట్ చేయలేకపోయాం. ఫ్యామిలీ థీమ్ లో వాళ్ల అమ్మను బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంది. ఇప్పుడిలా ఎపిసోడ్ చూసేటప్పుడు వాళ్ల అమ్మను గుర్తు చేసుకుని చాలా ఏడుస్తోంది. మేమంతా గీతూతో ఉన్నాం. మీరు కూడా ఉంటారనుకుంటున్నాం’ అని రాసుకొచ్చాడు గీతూ భర్త వికాస్ (Geetu Husband). 

Read More: Bigg Boss Season 6: గీతూ రాయల్ (Geetu Royal) ఎలిమినేషన్ తర్వాత హీటెక్కిన హౌస్.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!