Biggboss Season6: ఈ వారం ఎలిమినేట్ అయిన ఇనయా సుల్తానా (Inaya Sulthana).. బిగ్ బాస్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
Biggboss Season6: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చివరి అంకానికి వచ్చేసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఈ ఎలిమినేషన్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఊహించని విధంగా ఇనయ పేరు తెరపైకి రావడం ఆశ్యర్యంతోపాటు షాక్‌కి గురి చేస్తోంది. ఎందుకంటే ఇనయా సుల్తానా (Inaya Sultana) .. బిగ్ బాస్ 6 విన్నర్ లేదంటే రన్నర్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ ఫిక్సయ్యారు. ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి ఆమెని ఈ వారం ఎలిమినేట్ చేశారని సమాచారం. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న ఇనయాని హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం నామినేషన్స్ లో రేవంత్, కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయా, రోహిత్ ఉన్నారు. శ్రీహాన్ కు టికెట్ టూ ఫినాలే రావడంతో అతడికి నామినేషన్స్ నుంచి మినహాయింపు దొరికింది. అలానే ఫైనల్ లో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ గానూ నిలిచాడు. ఇక, ఈ సీజన్ ప్రారంభం నుంచి ఒంటరిగానే పోరాడుతూ వచ్చిన ఇనయా.. హౌసులోని ప్రతి ఒక్కరికీ గట్టి పోటీ ఇచ్చింది. గత కొన్ని వారాలుగా ఓటింగ్ లో ఏ పోల్ చూసుకున్నా సరే ఇనయానే (Inaya Sulthana) టాప్-3లో ఉంది.
టాస్క్ ఏదైనా, గేమ్ ఏదైనా అందులో తాను ఉండేలా చూసుకుంటూ అందరి టార్గెట్ అయ్యింది. చర్చనీయాంశంగా మారింది. ఎక్కువగా తనపైనే చర్చ జరిగేలా చూసుకోవడంలో ఇనయా (Inaya Sulthana) సక్సెస్ అయ్యింది . అదే సమయంలో తెలివిగా గేమ్ ఆడుతూ, అంతే తెలివిగా ఎదుటి వారిని ఇరకాన పెడుతూ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తూ వచ్చింది.
అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడం అనేది ఈ సీజన్‌లో పెద్ద షాకింగ్. బిగ్ బాస్ (Telugu Biggboss) లవర్స్ మాత్రం ఇనయ ఫినాలే వరకూ ఉండాలనే కోరుకుంటున్నారు.. అంతేకాదు.. ఇనయ ఎలిమినేట్ అనే లీక్ బయటకు రావడంతో.. ఇక బిగ్ బాస్ చూడ్డమే అనవసరం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.
అయితే, ఇలాంటి లీక్‌లు ప్రతి వారం జరుగుతుంటాయి. అన్నీ నిజమే అవుతూ వస్తున్నాయి. అలానే ఇది కూడా నిజమే అయి ఉంటుందని మరో వాదన. ఏదేమైనా ఇనయ ఎలిమినేట్ అనేది నమ్మలేని విధంగా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇనయతోపాటు శ్రీ సత్య (Sri Satya) కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారట. ఈ వారం మరో ఎలిమినేషన్ కూడా ఉండబోతోందట. అందులో డేంజర్ జోన్‌లో ఉన్న శ్రీ సత్య కూడా మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.