Biggboss Season 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో చివరి కెప్టెన్ ఇనయా సుల్తానా (Inaya Sultana)..!

Updated on Nov 26, 2022 11:17 AM IST
కెప్టెన్సీ టాస్క్ లో ఇనయా (Inaya Sultana) పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఇనయా ఆటకు కీర్తి, శ్రీసత్యలు (Sree Satya) తేలిపోయారు. 
కెప్టెన్సీ టాస్క్ లో ఇనయా (Inaya Sultana) పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఇనయా ఆటకు కీర్తి, శ్రీసత్యలు (Sree Satya) తేలిపోయారు. 

Biggboss Season 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు వచ్చేసింది. దీంతో టాప్ 5లో ఎవరు ఉంటారు.? విన్నర్ ఎవరు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ వారం ఎపిసోడ్స్ చాలా ఆసక్తికరంగా సాగాయి. హౌస్ మేట్స్ కు సంబంధించిన ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తూ ఉండటంతో బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ వాతావరణం క్రియేట్ అయింది.

ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో హౌస్ మేట్స్ గాల్లో తేలిపోతున్నారు. కళ్లనిండా వారిని చూసుకుని మనసు నిండా వార జ్ఞాపకాలు పదిలంగా దాచుకుని అయినవాళ్లకు భారంగా వీడ్కోలు పలుకుతున్నారు ఇంటి సభ్యులు. మరో మూడు, నాలుగు వారాల్లో తిరిగి ఇంటికి వచ్చేస్తామంటూ కళ్లతోనే సంభాషిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో చివరగా రేవంత్ (Singer Revanth) తల్లి వచ్చి వెళ్లిపోవడంతో ఫ్యామిలీ వీక్ ముగిసింది.

ఇక, ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా ఇనయా సుల్తానా (Inaya Sultana) తల్లి.. ఎంట్రీ ఇచ్చి కూతురికి అనేక విషయాలు తెలియజేసి కప్పు గెలవడం మాత్రమే కాదు హౌస్ లో కెప్టెన్ కూడా అవ్వాలని.. కెప్టెన్ గా నిన్ను చూడాలనుకుంటున్నాను, టైటిల్ గెలిచి వస్తావని నేను ఆశిస్తున్నాను అని తెలియజేశారు. ఈ క్రమంలో సీజన్ 6 చివరి కెప్టెన్ గా ఇనాయా… గెలిచి తన తల్లి కోరిక నెరవేర్చింది. 

తాజాగా హౌస్ లో చివరి కెప్టెన్సీ పోటీ (Captaincy Task) జరిగింది. ఇందులో భాగంగా ఒక రౌండ్ చుట్టూరా ఇంటి సభ్యులందరూ నిలబడి ఉంటారు. బజర్ మోగినప్పుడు మధ్యలో ఉన్న బంతిని అందుకోవాలి. మళ్లీ బజర్ మోగే సమయానికి ఎవరి చేతిలో అయితే బంతి ఉంటుందో వారు ఇద్దరిని ఆటలో నుంచి తొలగించాలి. 

ఇందులో ఇంటి సభ్యులంతా హోరా హీరోగా పోటీపడ్డారు. ఈ టాస్క్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు పోటీపడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరి రౌండ్‌‌లో ఆదిరెడ్డితో శ్రీసత్య, ఇనయ, కీర్తిలు చాలా పోరాడారు. చివరికి ఆదిరెడ్డిని ఆట నుంచి ఔట్ చేశారు. ఆ తరువాత ఇనయా పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఇనయా ఆటకు కీర్తి, శ్రీసత్యలు (Sree Satya) తేలిపోయారు. 

ఫలితంగా ఇనయా (Inaya Sultana) చివరి కెప్టెన్ గా నిలిచింది. ఈ విషయం తెలిసి ఇనయ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎట్టకేలకు కెప్టెన్ అవ్వాలన్న ఆమె కల నెరవేరిందని సంతోషపడుతున్నారు. ఈ దెబ్బతో ఇనయా ఏకంగా సెమీ ఫైనల్స్ లో స్థానం సంపాదించుకుంది.

Read More: Biggboss Season 6: వెక్కి వెక్కి ఏడ్చేసిన గీతూ రాయల్ (Geetu Royal).. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ చూసి ఎమోషనల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!