Bigg boss Season 6: త్వ‌ర‌లో బిగ్ బాస్ సీజ‌న్ 6.. ఈసారి కంటెస్టెంట్లు ఎవ‌రంటే?

Updated on May 28, 2022 11:48 PM IST
బిగ్ బాస్ సీజ‌న్ 6 కంటెస్టెంట్లు (Bigg boss Season 6 Contestants)
బిగ్ బాస్ సీజ‌న్ 6 కంటెస్టెంట్లు (Bigg boss Season 6 Contestants)

బుల్లితెర‌పై అత్యంత ఫేమ‌స్ అయిన షోల‌లో బిగ్‌బాస్ ఒక‌టి. ఇటీవ‌లే బిగ్‌బాస్ ఓటీటీ షో (Biggboss OTT) ముగిసిన సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ బిందు మాధ‌వి ఈ షో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. అయితే, దీనికి పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఈ సారి కూడా అక్కినేని నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

ఇటీవ‌లే హోస్ట్ నాగార్జునతో కూడిన ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో ఈసారి తమ షోలో సామాన్యులకు అవకాశం ఇస్తున్నట్లు నాగార్జున (Akkineni Ngarjuna) ప్రకటించారు. దాదాపు నెలరోజుల్లో బిగ్ బాస్ తెలుగు 6 ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ సీజన్‌లో పాల్గొనే సెలబ్రిటీల జాబితా తాజాగా తెరపైకి వచ్చింది. ఎప్పటిలాగే సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటు బుల్లితెర స్టార్స్‌ని సైతం ఈసారి హౌస్‌లోకి పంపుతున్నట్లు సమాచారం అందుతోంది.

మ‌రోవైపు.. బిగ్ బాస్ సీజ‌న్ 6 లో (Bigg boss telugu 6) ఎంత మంది కంటెస్టెంట్లు ఉంటారనే విష‌యంపై ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో బిగ్‌బాస్ ఓటీటీలో, టాప్ 5 స్థానాల్లో నిలిచిన వారిని సీజ‌న్ 6 లో తీసుకుంటామ‌ని గ‌తంలో చెప్పారు. నిజంగా అదే జ‌రిగితే, ఇంకో 8 మంది కంటెస్టెంట్లను తీసుకుంటే స‌రిపోతుంది. అందులో ఒక కంటెస్టెంట్ సామాన్య ప‌బ్లిక్ ఉంటారు కాబట్టి ఇంకో 7 మంది సెల‌బ్రిటీల‌ను తీసుకుంటే సరిపోతుంది.

దీంతో ఈ 7 మందిలో సెల‌బ్రిటీలు ఎవ‌రెవ‌రు ఉంటారు.. అనే విష‌యంపై ప్ర‌స్తుతం భారీగా చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే, ఈ సీజ‌న్‌లో పాల్గొన‌బోయే కొంద‌రు కంటెస్టెంట్ల పేర్లు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. 

ఇక వారి వివ‌రాలు ఇలా ఉన్నాయి. స్టార్ యాంకర్ ఉదయభాను బిగ్ బాస్ 6 (Bigg boss telugu 6)  లో పాల్గొంటున్నారట. ఒకప్పటి ఈ బిజీ యాంకర్ వ్యక్తిగత కారణాలతో ఇప్ప‌టివ‌ర‌కు పరిశ్రమకు దూరమయ్యారు. చాలా గ్యాప్ త‌ర్వాత‌ ఇటీవలే ఇండస్ట్రీలోకి కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ పొడుగు యాంకర్ ప్ర‌స్తుతం ప‌లు షోలు చేస్తున్నారు. ఓ దశలో ఉదయభాను అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ ఉండేది. ప్ర‌స్తుత ఫేమ‌స్ యాంక‌ర్ అయిన‌ సుమ కూడా ఆమె తర్వాతే అన్న‌ట్లు ఉండేది. కాగా, ఉదయభాను (Udaya Bhanu) హీరోయిన్ గా కూడా సినిమాలు చేశారు. అనసూయ, రష్మీ లాంటి యాంకర్స్ కి కూడా ఆమె స్ఫూర్తి.

అలాగే వీరితో పాటు జబ‌ర్ద‌స్త్ షో ద్వారా పాపుల‌ర్ అయిన గెట‌ప్ శ్రీ‌ను, సీరియ‌ల్ న‌టుడు అనుదీప్ చౌద‌రి, ఆర్‌జే హేమంత్‌, యాంక‌ర్లు రోజా, ప్ర‌త్యూష‌, సింగ‌ర్ మామ సింగ్ అలియాస్ కృష్ణ చైత‌న్య‌, న‌టుడు కౌశిక్‌, యూట్యూబ‌ర్ నిఖిల్‌.. త‌దిత‌రులు ఈ సీజ‌న్‌లో పాల్గొంటార‌ని తెలుస్తోంది. ఇక, బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న అనిల్ రాథోడ్, యాంకర్ శివ, నటుడు అజయ్, మిత్ర శర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్ శివ, మిత్ర శర్మ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అనిల్, శివ, మిత్ర శర్మ ఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే. అయితే దీనిపై త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. మరి వీరిలో నిజంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరని తెలియాలంటే ఫస్ట్ ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!