Biggboss Season6: బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా (Faima).. హోస్ట్ నాగార్జున (Nagarjuna) చేసిన పనికి షాక్!

Updated on Dec 05, 2022 12:14 PM IST
సరదా అంతా అయిపోయాక ఆఖరికి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. చివరగా ఆదిరెడ్డి, ఫైమా (Faima) ఉండగా ఫైమా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
సరదా అంతా అయిపోయాక ఆఖరికి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. చివరగా ఆదిరెడ్డి, ఫైమా (Faima) ఉండగా ఫైమా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

Biggboss Season6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నుంచి 12వ వారానికి గానూ మరో ఎంటర్‌టైనింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఫైమా (Faima) హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు మాత్రమే మిగిలారు. నిజానికి గత వారమే ఫైమాను ప్రేక్షకులు ఎలిమినేట్ చేయగా.. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో ఫైమా సేఫ్ అయ్యింది. ఆమె బదులు రాజ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. దీంతో వచ్చే వారం కచ్చితంగా ఫైమా ఎలిమినేట్ అయిపోతుందని అప్పుడే అంతా ఊహించారు.

ఇదిలా ఉంటే.. బిగ్ హౌస్ సండే ఫన్ డేలో భాగంగా ‘హిట్ 2’ (Hit 2 Movie Unit) చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ క్రమంలోనే ముందుగా నాగార్జున ఇంటి సభ్యులకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ ఎవరు? అసలు జీవితంలో ఫ్రెండ్ గా ఎవరు వద్దు? అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్ లో ఆదిరెడ్డి.. ఫైమాను ఫ్రెండ్ అని.. ఇనయతో ఫ్రెండ్ షిప్ ఉండదని చెప్పాడు. ఆ తర్వాత ఇనయ కీర్తిని ఫ్రెండ్ గా.. శ్రీహాన్ తో ఫ్రెండిషిప్ డౌట్ అంటూ అతడి ఫోటోను చించేసింది. 

ఇక శ్రీహాన్ వంతు రాగా.. రేవంత్ (Singer Revanth) లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని.. ఆదిరెడ్డి నెల్లూరులో ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలిసే ఛాన్స్ ఉండది అతని ఫోటోను చించేశాడు. ఇక రోహిత్.. రేవంత్ ఫ్రెండ్ అని.. ఫైమాతో స్నేహం కట్ అవుతుందేమోనని అన్నాడు. పైమా.. ఆది రెడ్డి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని.. రోహిత్ తో ఎక్కువ కనెక్షన్ లేదని చెప్పింది. కీర్తి.. ఇనయా ఫ్రెండ్ అని.. శ్రీహాన్ కాదని చెప్పింది. రేవంత్.. శ్రీసత్య ఫ ఫ్రెండ్ అని.. కీర్తి తనను తక్కువ అర్థం చేసుకుంటుందని చెప్పాడు. చివరగా శ్రీసత్య.. రేవంత్ ఫ్రెండ్ అని.. రోహిత్ తో తక్కువ కనెక్షన్ ఉందని అతని ఫోటో చెత్త బుట్టలో పడేసింది.

ఆ తర్వాత 'సమ్ మోర్ ఫన్ గేమ్స్ అంటూ డమ్ షల్ ఆర్ట్స్ ఆడించాడు నాగార్జున. బిగ్ బాస్ 'ఓ పిట్ట కథ' సినిమా పోస్టర్ ని ఇనయా (Inaya Sultana), శ్రీహాన్ కి ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీసత్య 'దేశముదురు' మూవీ టైటిల్ ని చెప్పలేకపోగా శ్రీహాన్ కి ఆ టైటిల్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఫైమా 'మిస్టర్ పర్ఫెక్ట్' చెప్పగా, ఆ టైటిల్ ని రోహిత్ కి డెడికేట్ చేసాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి,'చంద్రముఖి' టైటిల్ ని గెస్ చేయలేకపోగా, ఆ టైటిల్ ని కీర్తి భట్ కి డెడికేట్ చేసారు. 'క్రాక్' టైటిల్ ని రేవంత్ కి ఇవ్వగా, ఫైమాకి 'జాతి రత్నాలు' టైటిల్ ని, 'అందాల రాక్షసి' టైటిల్ ని శ్రీసత్యకి ఇచ్చాడు.

అనంతరం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లను నిలబెట్టి రేవంత్‌ను సేఫ్ చేశారు నాగార్జున. ఆ తరవాత ‘హిట్ 2’ టీమ్ అడివి శేష్, మీనాక్షి చౌదరి, శైలేష్ కొలను వేదిక మీదికి వచ్చారు. వారితో నాగార్జున కాసేపు ఫన్ జనరేట్ చేశారు. హౌస్ మేట్స్‌తో అడివి శేష్ సరదాగా ముచ్చటించి ఆ తరవాత వారితో ఆట ఆడించారు. ‘హిట్ 2’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వారు బిగ్ బాస్‌కు వచ్చారు. ఈ సరదా అంతా అయిపోయాక ఆఖరికి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. చివరగా ఆదిరెడ్డి, ఫైమా (Faima) ఉండగా ఫైమా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

కాస్త భావోద్వేగాల నడుమ ఫైమా ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. ఫైమాకు వీడ్కోలు చెబుతూ.. ఓ సిక్రెట్ రివీల్ చేశాడు రేవంత్. ఫైమా చేతి మీద ముద్దు పెట్టనివ్వదని అన్నాడు రేవంత. చేతి మీద ముద్దు పెడితే ఫైమాకు చక్కిలిగింతలని.. అందుకే పెట్టనివ్వదని సీక్రెట్ చెప్పేశాడు. దీంతో నాగార్జున ఫైమా చెయ్యి అందుకునే ప్రయత్నం చేశారు. ఫైమా సిగ్గు పడుతూనే చేయి అందించింది. కానీ, నాగార్జున (Nagarjuna) ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే చేతిని వెనక్కి వెనక్కి లాగింది. అయితే ఆమె చేతిని లాగి ముద్దు పెట్టేశారు నాగార్జున. దీంతో ఫైమా రెండు చేతులతో మొహాన్ని మూసుకుని తెగ సిగ్గుపడిపోయింది. అనంతరం ఫైమాకు తన బిగ్ బాస్ జర్నీని చూపించారు నాగార్జున. 

Read More: Biggboss Season 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో చివరి కెప్టెన్ ఇనయా సుల్తానా (Inaya Sultana)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!