Biggboss Season6: బిగ్ బాస్ సీజన్ 6 కు శుభం కార్డు.. విన్నర్ గా సింగర్ రేవంత్ (Singer Revanth).. రన్నరప్ ఎవరంటే?
Biggboss Season6: తెలుగు బిగ్ బాస్ 6వ సీజన్ దాదాపుగా పూర్తయింది. మరి కొద్ది గంటల్లో శుభం కార్డు పడబోతోంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీ సత్య (Sri Satya) ఎలిమినేట్ అయింది. ఇందులో భాగంగా ఎవరు ఎలిమినేట్ కావాలని అనుకుంటున్నారో ప్రతి ఇంటి సభ్యుడు ఎవరైనా ఒకరి పేరు సూచించాలని బిగ్ బాస్ తెలియజేవారు. దీంతో మెజారిటీ సభ్యులు కీర్తి భట్ పేరును సూచించారు. కానీ హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం కాకుండా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా శ్రీసత్యను ఎలిమినేట్ చేశారు. దీంతో చివరికి 5గురు ఫైనలిస్ట్ లు మిగిలారు.
అయితే.. కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్ (Singer Revanth), శ్రీహాన్ (Shrihan) బిగ్ బాస్ తెలుగు 6 టాప్ 5 కంటెస్టెంట్లుగా అవతరించారు. వీరిలో ఒకరు విన్నర్ గా టైటిల్ సొంతం చేసుకోనున్నారు. ఇక, ఈ సారి విన్నర్ కాబోయే కంటెస్టెంట్ కు బిగ్ బాస్ టైటిల్ తో పాటు.. రూ.50లక్షల ప్రైజ్ మనీ, రూ.25లక్షల విలువగల సువర్ణ భూమి ప్లాట్, మారుతీ సుజుకీ బ్రిజా కారును సొంతం చేసుకోనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో విన్నర్ ఎవరనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ఈ ఐదుగురిలో రేవంత్ కు (Singer Revanth) అత్యధిక ఓట్లు వచ్చాయని.. టాప్ 2 లో శ్రీహాన్ నిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిగ్ బాస్ ఇంట్లో ఫైనల్ సంబరాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 6 చివరి ఎపిసోడ్ లో మాజీ ఇంటిసభ్యులు.. గ్రూపులుగా వచ్చి సందడి చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రతీ సీజన్ లో ఉన్నట్లు.. ఈ సీజన్ విన్నర్ ఎవరనేదానిపై ప్రేక్షకులలో ఎలాంటి ఉత్కంఠ లేకపోవడం గమనార్హం. ఎందుకంటే.. సీజన్6 విన్నర్.. రేవంత్ (Singer Revanth) అంటూ సోషల్ మీడియాలో మొదటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సభ్యులలో ఎక్కువ పాపులారిటీ ఉన్నది కూడా అతనికి మాత్రమే కావడం విశేషం. దీంతో ఈ సీజన్ ను ఇంతకుముందు జరిగిన సీజన్లతో పోలిస్తే అంత క్రేజ్ దక్కించుకోలేదనే చెప్పవచ్చు.