Manchu Mohanbabu: 'విశ్వామిత్ర'గా మంచు మోహన్‌బాబు.. 'అగ్ని నక్షత్రం' (Agni Nakshathram) నుంచి ఫస్ట్ లుక్ !

Updated on Aug 01, 2022 08:34 PM IST
'అగ్ని నక్షత్రం' (Agni Nakshatram) సినిమాలో మోహన్ బాబు విశ్వామిత్ర (Viswamitra) అనే ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు.
'అగ్ని నక్షత్రం' (Agni Nakshatram) సినిమాలో మోహన్ బాబు విశ్వామిత్ర (Viswamitra) అనే ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు.

టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohanbabu) ప్రొఫెసర్‌ విశ్వామిత్రగా మారారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ని రివీల్ చేశారు మేకర్స్. 

ఇందులో మోహన్ బాబు విశ్వామిత్ర (Viswamitra) అనే ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. మధ్యవయస్కుడిగా, చేతిలో పెన్నుతో, సీరియస్ లుక్స్‌తో ఉన్న కలెక్షన్ కింగ్ తను ఇలాంటి పాత్ర పోషించడం ఇదే తొలిసారి అని అన్నారు. మంచు లక్ష్మి కూడా ఈ మూవీలో ఓ పాత్ర పోషిస్తోంది.    

మంచు మోహ‌న్ బాబు న‌ట‌ వార‌సురాలిగా సినీ గడప తొక్కిన మంచు లక్ష్మి (Manchu Lakshmi).. విరామం లేని సినీ ప్రయాణం చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పలు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది.  

ప్రతీక్ ప్రజోష్ (Prateek Prajosh) ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ఫస్ట్ లుక్ విడుదల అయ్యాక, మంచు ఫ్యామిలీ అభిమానులు అభినందనలు తెలుపుతుండగా, కొందరు ఎప్పట్లాగే విమర్శిస్తున్నారు. టైటిల్‌లో కొత్తదనం లేదని, ఆ పేరుతో ఇప్పటికే టాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయని మరికొందరు అంటున్నారు. 

'అగ్ని నక్షత్రం' (Agni Nakshathram) చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నటుడు సిద్దిక్ విలన్‌గా నటిస్తున్నారు. విశ్వంత్ కథా నాయకుడిగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

Read More: 'అగ్ని నక్షత్రం'లో విల‌న్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్!.. కేర‌ళ న‌టుడిపై మంచు ల‌క్ష్మీ (Manchu Lakshmi ) ట్వీట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!