'అగ్ని నక్షత్రం'లో విల‌న్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్!.. కేర‌ళ న‌టుడిపై మంచు ల‌క్ష్మీ (Manchu Lakshmi ) ట్వీట్

Updated on Jul 28, 2022 06:54 PM IST
'అగ్ని నక్షత్రం'లో సిద్దిక్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మంచు ల‌క్ష్మీ  (Manchu Lakshmi )  త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
'అగ్ని నక్షత్రం'లో సిద్దిక్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మంచు ల‌క్ష్మీ  (Manchu Lakshmi )  త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

Agni Nakshatram: టాలీవుడ్‌లో మంచు ల‌క్ష్మీ  (Manchu Lakshmi )  త‌న న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు, టీవీ షోలు, ఓటీటీ షోల‌తో మంచు ల‌క్ష్మీ త‌న ఫాలోయింగ్ పెంచుకున్నారు. మంచు లక్ష్మి మొదటిసారిగా తన తండ్రి మెహ‌న్ బాబుతో క‌లిసి 'అగ్ని నక్షత్రం' సినిమాలో న‌టిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థ‌తో 'అగ్ని న‌క్ష‌త్రం' తెర‌కెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను మంచు ల‌క్ష్మీ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. 

సిద్దిక్ ఫ‌స్ట్ లుక్‌పై మంచు లక్ష్మీ పోస్ట్

'అగ్ని నక్షత్రం' సినిమాలో మోహ‌న్ బాబుతో పాటు త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని, కేర‌ళ సీనియ‌ర్ న‌టులు సిద్దిక్ న‌టిస్తున్నారు. సిద్దిక్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మంచు ల‌క్ష్మీ  (Manchu Lakshmi )  త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా సిద్దిక్ పాత్ర ఎలా ఉండ‌బోతుందో కామెంట్ల రూపంలో తెలిపారు. సిద్దిక్ ఈ సినిమాలో బ‌ల‌రాం వ‌ర్మ అనే విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. విల‌న్‌గా సిద్దిక్ గొప్ప‌గా న‌టించారంటూ మంచు ల‌క్ష్మీ తెలిపారు. 

 
 
ఆత్యంత శక్తివంతుడు, ఫెరోషియస్ ఫార్మా టైకూన్ బలరాం వర్మను మీకు పరిచయం చేస్తున్నాం. మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం, ఆపడం ఎవరితరం కాదు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు శ్రీ సిద్దిక్ గారు మా సినిమాలో ఒక భాగమవ్వడం మాకు గర్వకారణం.
మంచు ల‌క్ష్మీ
 

ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో 'అగ్ని న‌క్ష‌త్రం' తెర‌కెక్కుతుంది. ఈ సినిమాకు లిజో కే జోషి సంగీతం అందిస్తున్నారు. తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు లక్ష్మి సంయుక్తంగా 'అగ్ని న‌క్ష‌త్రం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రితో తాను న‌టించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని మంచు లక్ష్మీ  (Manchu Lakshmi ) తెలిపారు.

Read More : Ginna: నాన్న‌ కోసం స్నేహ గీతం పాడిన మంచు అరియానా, వివియానాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!