Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ లో అలిగిన గెస్ట్ ఉషా ఉతుప్.. క్షమాపణ చెప్పిన శ్రీరామచంద్ర

Updated on Jun 05, 2022 03:18 PM IST
తెలుగు ఇండియన్ ఐడల్ పోస్టర్ (Telugu Indian Idol Poster)
తెలుగు ఇండియన్ ఐడల్ పోస్టర్ (Telugu Indian Idol Poster)

Telugu Indian Idol: తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ పైనల్ దశకు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరు కాగా.. బాలయ్య కూడా షోలో తన వాక్చాతుర్యంతో సందడి నెలకొల్పారు. తెలుగు ఇండియన్ ఐడల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటిగా నిలిచింది. ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం 6 మంది పోటీదారులు ఉన్నారు. వీరంతా ఇండియన్ ఐడల్ ౧ టైటిల్‌ను గెలుచుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్నారు. ఉషా ఉతప్ ప్రస్తుత ఎపిసోడ్‌లకు ప్రత్యేక అతిథిగా ఇండియన్ ఐడల్‌కి వచ్చారు. ఇక తాజాగా ప్రసారమైన 29వ ఎపిసోడ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 

ఈ షోకి జడ్జ్ గా విచ్చేసిన ఉషా ఉతుప్‌ (Usha Utup) కోపంతో ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. అయితే అసలు ఏమైంది? అంతటి లెజండరీ సింగర్ ఎందుకలా చేయాల్సి వచ్చింది? అనే వివరాలోకి వెళితే.. హోస్ట్ శ్రీరామ చంద్రకు కవిత్వం చెప్పడం అలవాటు ఉంది, ఈ ఎపిసోడ్ లో కూడా ఆయన ఉషా ఉతుప్‌పై ఒక కవిత వినిపించారు. శ్రీరామ్ "ఉషా ఉతుప్‌ గారు ..మీ వాయిస్ గంభీరం .. మీ పాట అమృతం .. మీరు మైక్ లేకుండా పాడితే కీచురాళ్ళు.. అది వినిపిస్తుంది కొన్ని మైళ్ళు.. మీ నుదిటిన పెద్ద బొట్టు .. ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు ఒట్టు " అంటూ ఆమె మీద ఒక కవితను సంధించారు. 

అది విన్న ఉషా ఉతుప్‌.. ఆ తరువాత 'నా మీద నేను జోక్స్ వేసుకొని నవ్వుకుంటాను. కానీ నువ్వు ఈరోజు నన్ను గంభీరం అని సంబోధించావ్. ఇలా అనడం నాకు నచ్చలేదు. ఈ షో కోసం నేను కోల్ కతా నుంచి వచ్చాను.. ఇన్ని వేల మంది చూస్తున్న ఈ షోలో నన్ను ఇలా అవమానించడం ఏం బాలేదు' అంటూ శ్రీ రామచంద్ర మీద ఫైర్ అయ్యి సీట్లో నుంచి లేచి వెళ్లిపోతుంది ఉషా ఉతుప్ (Usha Utup). ఈ దెబ్బకు షోలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీరామ చంద్రకు కూడా అసలేం జరుగుతుందో అర్ధం కాక ఉషాఉతుప్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు.

అయితే, ఆ తర్వాత చివరికి ఉష కూడా నవ్వేసి 'నేను అలాంటి దాన్నా కాదా, అనేది ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. నా మీద నేనే జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటాను. ఇదంతా లైట్' అనేసరికి శ్రీరామ్ (Sreeramachandra) కు ప్రాణం లేచొచ్చినట్టైంది. ఆ వెంటనే తమన్ స్టేజిని కూల్ చేయడానికి " ఉషా ఉతుప్ కాదు ఉషా షట్ అప్" అని అనేసరికి అందరూ నవ్వేశారు. అలా శ్రీ రామ్ మీద ప్రాంక్ చేసి ఆమె షాక్ ఇచ్చింది. ఇంత గ్రేట్ ప్రాంక్ చేసి నా దిమ్మ తిరిగేలా చేశారు అంటూ శ్రీరామ్ అనేసరికి ఉషా కూడా సరదాగా న‌వ్వేశారు. 

ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 25 నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ (Telugu Indian Idol) రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. 32 ఏపిసోడ్స్ గా రన్ అవుతున్న ఈషో తాజాగా చివరి దశకు చేరుకుంది. ఈ షోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్, అందాల హీరోయిన్ నిత్యామీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ శ్రీ రామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే షో లేటెస్ట్ ఎపిసోడ్ కు హాజరైన నందమూరి బాలక్రిష్ణ (Balakrishna) సింగర్స్ తో కలిసి సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు డైలాగ్స్ తో అందరిలో జోష్ నింపారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!